Thalapathy 66 : విజయ్-వంశీ-రష్మిక సినిమా షురూ.. పూజా కార్యక్రమంతో మొదలు..
ఇటీవల తమిళ హీరోలు తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు తెలుగు డైరెక్టర్స్ దర్శకత్వంలో తమిళ హీరోల సినిమాలు మొదలయ్యాయి.

Rashmika
Thalapathy 66 : ఇటీవల తమిళ హీరోలు తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు తెలుగు డైరెక్టర్స్ దర్శకత్వంలో తమిళ హీరోల సినిమాలు మొదలయ్యాయి. ధనుష్, శివ కార్తికేయన్ ఇప్పటికే తెలుగులో సినిమాలు మొదలు పెట్టారు. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగులో వంశీ పైడిపల్లితో సినిమా చేయనున్నట్టు గతంలోనే ప్రకటించారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
RGV : చాలా చిన్నది అంటూ.. రాడిసన్ పబ్ ఘటనపై ఆర్జీవీ కామెంట్స్
విజయ్ 66వ సినిమాగా ఇది తెరకెక్కుతుంది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించనుంది. తమన్ సంగీతం అందించనున్నారు. సీనియర్ నటులు శరత్ కుమార్ ముఖ్య పాత్ర పోషించనున్నారు. తాజాగా ఇవాళ ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఇవాళ్టి నుంచి ఈ సినిమా అధికారికంగా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఇవాళ్టి పూజా కార్యక్రమానికి విజయ్, రష్మిక, చిత్ర యూనిట్ తో పాటు పలువురు ప్రముఖులు విచ్చేశారు.
#Thalapathy66⭐ Launched on an propitious note with a formal pooja ceremony ?
Regular shoot kick starts today ?
THALAPATHY @actorVijay ?@directorvamshi @iamRashmika @MusicThaman #KarthickPalani @Cinemainmygenes #DilRaju #Shirish @SVC_official #Thalapathy66Launched ? pic.twitter.com/Y5tDb9DAmD
— BA Raju’s Team (@baraju_SuperHit) April 6, 2022