షూటింగ్ స్పాట్ లో విజయ్ కు స్వాగతం పలికిన అభిమానులు

ప్రముఖ నటుడు దళపతి విజయ్ కొన్ని రోజుల క్రితం మాస్టర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా ఐటి అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐటీ రైడ్స్ తర్వాత విజయ్ ఎప్పటిలానే షూటింగ్ కు హాజరయ్యాడు. తమిళనాడులోని నైవేలీ ప్రాంతంలో గనుల్లో విజయ్ షూటింగ్ జరుగుతోంది.
అయితే షూటింగ్ స్పాట్ దగ్గర విజయ్ అభిమానులు తనకు ఘనంగా స్వాగతం పలికారు. ఇక ఈ సినిమాలో విజయ్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నట్లు అభిమానులు అంచనా వేస్తున్నరు. ఇద్దరు విజయ్ ల కలయికలో రానున్న ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఎక్స్ బీ ఫిలిమ్ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ. ఇక సమ్మర్ హాలిడేస్ సందర్భంగా ఏప్రిల్ 9న సినిమా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.