విజయ్ ‘విజిల్’ – అక్టోబర్ 25 విడుదల

దళపతి విజయ్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘బిగిల్’.. దీపావళి కానుకగా అక్టోబర్ 25న తమిళ్, తెలుగులో గ్రాండ్‌గా విడుదల కానుంది..

  • Published By: sekhar ,Published On : October 18, 2019 / 05:59 AM IST
విజయ్ ‘విజిల్’ – అక్టోబర్ 25 విడుదల

Updated On : May 28, 2020 / 4:07 PM IST

దళపతి విజయ్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘బిగిల్’.. దీపావళి కానుకగా అక్టోబర్ 25న తమిళ్, తెలుగులో గ్రాండ్‌గా విడుదల కానుంది..

దళపతి విజయ్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘బిగిల్’.. ఈ దీపావళికి బాక్సాఫీస్ వద్ద సందడి చెయ్యడానికి రెడీ అయిపోయింది.  ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో, స్పోర్ట్స్ అండ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ‘బిగిల్’లో విజయ్ రాజప్ప, మైఖేల్‌గా ద్విపాత్రాభినయం చేశాడు. నయనతార హీరోయిన్.. ‘బిగిల్’ తెలుగులో ‘విజిల్’ పేరుతో విడుదల కానుంది.

118 నిర్మాత మహేష్ కోనేరు ‘బిగిల్’ నిర్మాతలతో కలిసి తెలుగులో రిలీజ్ చేస్తుండగా.. దిల్ రాజు నైజాంలో పంపిణీ చేస్తున్నాడు. రీసెంట్‌గా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. తమిళ్ ట్రైలర్ 30 మిలియన్లకు పైగా వ్యూస్, 2 మిలియన్లకు పైగా లైక్స్‌తో.. ఇండియాలో మోస్ట్ లైక్డ్ అండ్ వరల్డ్‌లో మోస్ట్ లైక్డ్ ట్రైలర్‌గా 4వ ప్లేస్‌లో ఉంది. తమిళ వెర్షన్ సెన్సార్ పూర్తయింది.

Read Also : కార్తి ‘ఖైదీ’ – అక్టోబర్ 25 విడుదల

కోలీవుడ్ సెన్సార్ టీమ్ U/A సర్టిఫికెట్ జారీ చేసింది. దీపావళి కానుకగా అక్టోబర్ 25న తమిళ్, తెలుగులో గ్రాండ్‌గా విడుదల కానుంది. సంగీతం : ఎ.ఆర్.రెహమాన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : అర్చన కల్పతి, నిర్మాతలు : కల్పతి ఎస్.అఘోరం, కల్పతి ఎస్.గణేష్, కల్పతి ఎస్.సురేష్.