Thaman: సర్కారు వారి పాటను ప్రమోట్ చేస్తున్న థమన్.. అంత స్పెషల్ ఏంటో?

ప్రెజెంట్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ చేతిలో సౌత్ స్టార్స్ సినిమాలున్నాయి. హీరోలందరూ నువ్వే కావాలని థమన్ వెంట పడుతుంటే.. ఈ మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం మహేశ్ బాబు సినిమానే స్పెషల్ గా..

Thaman: సర్కారు వారి పాటను ప్రమోట్ చేస్తున్న థమన్.. అంత స్పెషల్ ఏంటో?

S.thaman

Updated On : April 2, 2022 / 1:12 PM IST

Thaman: ప్రెజెంట్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ చేతిలో సౌత్ స్టార్స్ సినిమాలున్నాయి. హీరోలందరూ నువ్వే కావాలని థమన్ వెంట పడుతుంటే.. ఈ మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం మహేశ్ బాబు సినిమానే స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నాడు. సర్కారు వారి పాటపై ఎక్స్ ట్రా కాన్సట్రేషన్ చేస్తున్నాడు.. సూపర్ స్టార్ సినిమాని సూపర్ గా ప్రమోట్ చేస్తున్నాడు.

Thaman : ‘రాధేశ్యామ్’ ట్రోలింగ్‌పై కౌంటర్ ఇచ్చిన తమన్

ఈ మధ్య ఏ పాట విందామన్నా, ఏ స్టార్ ఆల్భమ్ చూసినా తమన్ మ్యూజిక్కే వినిపిస్తోంది. ఇక తమన్ ఫ్యూచర్ ప్రాజెక్టుల లిస్ట్ కూడా చాలా పెద్దదే. టాలీవుడ్ టాప్ స్టార్స్ సినిమాలున్నాయి ఆయన చేతిలో. అయితే అన్నింటికన్నా సర్కార్ వారి పాట మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడు థమన్. ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమా కోసం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న థమన్.. ఈ సినిమా ఓ బ్లాక్ బస్టర్ అని ముందే ప్రమోట్ చేస్తున్నాడు. బీజీఎం కంపోజ్ చేస్తున్న తన కీ బోర్డ్ వీడియోతో ‘సర్కార్ వారి పాట బిజిఎమ్ స్టార్ట్, ఇది తనకు బ్లాక్ బస్టర్ జర్నీ అన్న ట్వీట్ చేసి, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాడు.

Thaman: మ్యూజిక్ సెన్సేషన్.. స్టార్స్ సినిమాలకి ఫెస్టివల్ కిక్కిస్తున్న థమన్

షూటింగ్ ముగించుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది సర్కార్ వారి పాట. ఈ మూవీ నుంచి ఫస్ట్ రిలీజైన కళావతి సాంగ్ కొత్త రికార్డులు సృష్టించి సత్తా చాటింది. వన్ మంత్ లో పదకొండు కోట్లకు పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్ సెన్సేషన్ గా నిలిచింది. ఆ తర్వాత మార్చి 20న వచ్చిన టైటిల్ సాంగ్.. పెన్నీ సాంగ్ కూడా సూపర్ రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది.. థమన్ మ్యాజికల్ మ్యూజిక్ తో పాటూ సితార స్పెషల్ డాన్స్ మహేశ్ ఫాన్స్ ను ఖుషి చేస్తోంది.

DSP-Thaman: పోటీపడుతున్న ఈ ఇద్దరూ.. మ్యూజిక్‌తో బాక్సులు బద్దలే!

సర్కార్ వారి పాట టీజర్ కు అమేజింగ్ రెస్పాన్స్ రావడం. థమన్ కెరీర్ లో షార్ట్ పీరియడ్ లో అత్యధిక వ్యూస్ & లైక్స్ సాధించిన పాటల్లో సర్కార్ వారి పాట ఫస్ట్ ప్లేస్ లో ఉండటం. సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాకి కూడా సంగీత దర్శకుడిగా థమన్ ఫిక్సవడంతో, మహేశ్ బాబు ఫ్యాన్స్ కూడా తమన్ ని అమితంగా అభిమానిస్తున్నారు. దాంతో ఎక్సాట్రా కాన్ సన్ట్రేషన్ తో సర్కార్ వారి పాట మ్యూజిక్ చేస్తున్నాడని అటు థమన్ ఫ్యాన్స్, ఇటు మహేశ్ బాబు ఫ్యాన్స్ ఫుల్ హాపీ ఫీలవుతున్నారు.