Game Changer – Thaman : ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ ఇచ్చిన తమన్.. వినాయకచవితికి..?

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ టీజర్ ఇవ్వమని ట్రెండ్ చేస్తున్నారు.

Game Changer – Thaman :  ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ ఇచ్చిన తమన్.. వినాయకచవితికి..?

Thaman Tweet on Game Changer Movie Fans Thinks Update on Vinayaka Chavithi

Updated On : September 6, 2024 / 1:32 PM IST

Game Changer – Thaman : రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ టీజర్ ఇవ్వమని ట్రెండ్ చేస్తున్నారు. సినిమా మొదలయి మూడేళ్లు దాటుతున్నా ఇప్పటివరకు ఒక్క పాట, ఒక్క పోస్టర్ తప్ప ఇంకేమి బయటకు రాకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో నిర్మాణ సంస్థని, శంకర్ ని తిడుతూ పోస్టులు పెడుతున్నారు.

Also Read : JR NTR : మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై స్పందించిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. ఏమ‌న్నారంటే..?

ఇలాంటి సమయంలో తమన్.. గేమ్ ఛేంజర్.. హ్యాపీ వినాయకచవితి 2024 అంటూ ట్వీట్ చేసాడు. తమన్ ట్వీట్ చూస్తుంటే వినాయకచవితి అంటే రేపు సెప్టెంబర్ 7న గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇవ్వనున్నారని, ఫ్యాన్స్ అడిగినట్టు టీజర్ లేదా గ్లింప్స్ ఇస్తారని తెలుస్తుంది. మరి నిజంగానే రేపు గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇస్తారా? లేకపోతే మళ్ళీ ఫ్యాన్స్ ని నిరాశపరుస్తారా చూడాలి. తమన్ ట్వీట్ తో మాత్రం ఫ్యాన్స్ అప్డేట్ ఇస్తారనే ఆశతో ఉన్నారు.