Vishwanath and Sons : ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ది వెడ్డింగ్ సాంగ్ వచ్చేసింది.. హీరో సూర్య పాడిన పాటను విన్నారా?
హీరో సూర్య నటిస్తున్న మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'(Vishwanath and Sons)
The Wedding Song Lyric Video out now from Vishwanath and Sons
Vishwanath and Sons : హీరో సూర్య నటిస్తున్న మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మమితా బైజు కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది.
Amulya : జబర్దస్త్ దొరబాబు భార్య.. యాంకర్ అమూల్య ఫోటోలు..
అందులో భాగంగా ఈ చిత్రం నుంచి వరుసగా పాటలను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన తొలి గీతం ‘నేనో బటర్‌ఫ్లై’ విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా రెండో పాట ‘ది వెడ్డింగ్ సాంగ్’ ను విడుదల చేసింది. సూర్య, మమితా బైజు తమ అద్భుతమైన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. ఒక ఘనమైన కుటుంబ వివాహంలోని ఆనందాన్ని, ఆత్మీయతను కళ్ళకు కట్టినట్లు ఈ పాటలో చూపించారు. ఈ పాటను సూర్య స్వయంగా పాడారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు.
