Tolly wood : టాలీవుడ్‌కు బిగ్ షాక్ ఇవ్వనున్న థియేటర్ ఓనర్స్!
థియేటర్ ఎగ్జిబిటర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక్కసారిగా కలకలం రేపుతోందట

థియేటర్ ఎగ్జిబిటర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక్కసారిగా కలకలం రేపుతోందట. ఇకపై సినిమా రిలీజ్ కావాలంటే రెంటల్ సిస్టమ్‌కు పూర్తి స్వస్తి చెప్పాల్సిందేనట. దానికి బదులుగా.. పర్సెంటేజ్ షేర్ ఆధారంగా మాత్రమే థియేటర్‌లలో స్క్రీన్స్ కేటాయిస్తామని ఎగ్జిబిటర్స్ తేల్చిచెప్తున్నారట. ఈ కీలక నిర్ణయంపై రాబోయే ఆదివారం జరిగే సమావేశంలో చర్చించి, తుది ముద్ర వేయనున్నారని తెలుస్తోంది.
ఈ నిర్ణయం అమలైతే, రిలీజ్‌కు సిద్ధమవుతున్న చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలకు ఇది భారీ షాక్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. రెంటల్ సిస్టమ్‌లో థియేటర్‌లకు ఫిక్స్‌డ్ చెల్లింపులతో సినిమాలు ఆడించే అవకాశం ఉండగా, పర్సెంటేజ్ విధానంలో కలెక్షన్స్ ఆధారంగా షేర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సినిమా ఆడకపోతే, థియేటర్ యాజమాన్యాలకు నష్టం రాకపోవచ్చు, కానీ నిర్మాతలకు మాత్రం రిస్క్ పెరుగుతుందని టాక్.
Actress Gautami : సీనియర్ నటి గౌతమి ప్రాణాలకు ముప్పు..! పోలీసులకు ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..?
అంతేకాదు.. ఈ నియమాన్ని అంగీకరించకపోతే థియేటర్‌లను మూసివేసేందుకు కూడా ఎగ్జిబిటర్స్ సిద్ధమవుతున్నారని గాసిప్ రౌండ్ చేస్తోంది. దీంతో రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్న పలు సినిమాల నిర్మాతలు టెన్షన్‌లో ఉన్నారట. ముఖ్యంగా, బడా నిర్మాతలు, స్టార్ హీరోల సినిమాలు ఈ విధానంలో సర్దుకుపోయినా, చిన్న సినిమాలకు థియేటర్ స్క్రీన్స్ దొరకడం కష్టమవుతుందని అంటున్నారు.
Mega 157 : చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీ.. ఎంట్రీ ఇచ్చేసిన హీరోయిన్..
ఈ ఆదివారం జరిగే మీటింగ్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? థియేటర్‌లు మూతపడతాయా? లేక నిర్మాతలు కొత్త విధానాన్ని అంగీకరిస్తారా? అన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ గాసిప్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి మరి.