Puri Jagannath: అప్పుడు తమ్ముడు.. ఇప్పుడు కొడుకు.. పూరీ కష్టాలు!
పూరీ పాపం కష్టపడుతున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నా .. పూరీ కి మాత్రం కొడుకు కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తన కొడుకుని హీరోని చెయ్యడానికి ఆ హీరోని..

Puri Jagannath
Puri Jagannath: పూరీ పాపం కష్టపడుతున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నా .. పూరీ కి మాత్రం కొడుకు కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. తన కొడుకుని హీరోని చెయ్యడానికి ఆ హీరోని, ఈ హీరోని పట్టుకుని ఇంకా ఇబ్బందులుపడుతూనే ఉన్నారు ఈ స్టార్ డైరెక్టర్. ఆఖరికి కొడుకుని హీరోగా నిలబెట్టడానికి పాన్ ఇండియా స్టార్, పాన్ వరల్డ్ స్టార్ ని రంగంలోకి దింపారు పూరీ.
Malaika Arora: ముసలామె అంటూ ట్రోల్స్.. కామెంట్స్ ఆపేసిన మలైకా!
పూరీ జగన్నాధ్ .. సక్సెస్, ఫ్లాప్ ని పెద్దగా పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ.. ఫుల్ స్పీడ్ లో కెరీర్ ని లాగించేస్తున్నారు. వరుసగా హిట్స్ వస్తున్నా.. పాన్ ఇండియా స్టార్ తో సినిమా చేస్తున్నా.. ఇంకా పూరీ కెరీర్ గురించి వర్రీ అవుతున్నారు. తన ఫ్యామిలీలో హీరో ఉండాలనుకుంటున్న పూరీకి ఇంకా ఆ ఆశ మాత్రం తీరడం లేదు. అందుకే తన కొడుకుని హీరోగా నిలబెట్టడానికి స్టార్ హీరోలతో ప్రమోషన్లు చేయిస్తున్నారు.
Prabhas: మేకర్స్ హంటింగ్.. ప్రభాస్ విలన్స్ అంటే మాటలా!
పూరీ జగన్ ఫ్యామిలీ నుంచి హీరోగా ఫస్ట్ తన తమ్ముడ్ని ట్రై చేశారు. కానీ సాయిశంకర్ కూడా ఎన్ని సినిమాలు చేసినా.. సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకోలేకపోయారు. ఇప్పుడు తన కొడుకు ఆకాష్ పూరీని హీరోగా నిలబెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పూరీ కొడుకు ఆకాష్.. ఆంద్రా పోరి, మోహబూబా సినిమాలు అంతగా సక్సెస్ అవ్వకపోవడంతో ఈ సారి రిలీజ్ అవుతున్న రొమాంటిక్ సినిమాకు పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ తో ప్రమోషన్ గట్టిగా చేయించారు.
Jagapathi Babu: బాలీవుడ్‌లో జగ్గూభాయ్ ఎంట్రీ.. ఇక గర్జనే!
ఆకాష్ పూరి, కేతిక జంటగా అనిల్ డైరెక్షన్లో తెరకెక్కిన రొమాంటిక్ మూవీ ప్రమోషన్లు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. అక్టోబర్ 29న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా సక్సెస్ కావడానికి, అసలు సినిమాకి ఆడియన్స్ ని రప్పించడానికి అటు ప్రభాస్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండను కూడా వాడేస్తున్నారు. ఈ శుక్రవారం జరుగుతున్న రొమాంటిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. ఈ మాత్రం హైప్స్ ఉంటే జనాన్ని ధియేటర్ కి రప్పించడం పెద్ద కష్టమేం కాకపోయినా.. ఈ సారి రిజల్ట్ ఏంటో అని తెగ వర్రీ అయిపోతున్నారు పూరీ.