Tiger 3 : మరోసారి షారుఖ్, సల్మాన్ కాంబో.. YRF స్పై యూనివర్స్ లో దీపావళికి..

ఇటీవల అన్ని సినీ పరిశ్రమలు హాలీవుడ్ లాగే ఒక సినిమాకి, ఇంకో సినిమాకి లింక్ పెడుతూ సినిమాటిక్ యూనివర్స్ లు సృష్టిస్తున్నాయి. బాలీవుడ్ లో తాజాగా షారుఖ్ పఠాన్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా నిర్మాణ సంస్థ YRF స్పై యూనివర్స్ అని.............

Tiger 3 : మరోసారి షారుఖ్, సల్మాన్ కాంబో.. YRF స్పై యూనివర్స్ లో దీపావళికి..

Tiger 3 releasing on 2023 deepavali with salmaan and shahrukh combo

Updated On : February 6, 2023 / 9:45 PM IST

Tiger 3 : ఇటీవల అన్ని సినీ పరిశ్రమలు హాలీవుడ్ లాగే ఒక సినిమాకి, ఇంకో సినిమాకి లింక్ పెడుతూ సినిమాటిక్ యూనివర్స్ లు సృష్టిస్తున్నాయి. బాలీవుడ్ లో తాజాగా షారుఖ్ పఠాన్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా నిర్మాణ సంస్థ YRF స్పై యూనివర్స్ అని క్రియేట్ చేస్తుంది. గతంలో ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన టైగర్ జిందా హే, వార్, ఏక్ థా టైగర్.. లాంటి సినిమాలతో పాటు రాబోయే వార్ 2, టైగర్ 3.. లాంటి పలు సినిమాలని కూడా జత చేస్తూ YRF స్పై యూనివర్స్ సృష్టిస్తున్నామంటూ ప్రకటించారు.

దీంతో ఒక్కో హీరో సినిమాలో ఇంకో హీరో కచ్చితంగా కనపడతారు. దీనిపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ కనపడి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా రాబోతున్న టైగర్ 3 సినిమాని 2023 దీపావళికి రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. అయితే దీంతో పాటు పఠాన్ లో షారుఖ్ తో కలిసి సల్మాన్ మ్యాజిక్ చేశాడు. ఇప్పుడు టైగర్ లో సల్మాన్ తో కలిసి షారుఖ్ మ్యాజిక్ చేస్తాడు అని తెలిపారు. YRF స్పై యూనివర్స్ లో ఈ సినిమా భాగమవుతుంది అంటూ ఇప్పటినుంచే సినిమాపై అంచనాలు పెంచేశారు.

Vasanth Kokila : బాబీ సింహ, ఆర్య కలిసి థ్రిల్లింగ్ కథతో వస్తోన్న వసంత కోకిల ట్రైలర్ రిలీజ్.. మెగాస్టార్ చేతుల మీదుగా..

ఈ పోస్ట్ తో టైగర్ 3 సినిమాలో షారుఖ్ గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తాడని అర్థమైపోయింది. దీంతో అటు షారుఖ్ ఫ్యాన్స్ తో పాటు సల్మాన్ ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టైగర్ సిరీస్ లో వచ్చిన గత సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు ఈ సినిమా YRF స్పై యూనివర్స్ లో చేరడంతో మరింత విజయం సాధిస్తుందని బాలీవుడ్ అంటుంది. ఇక ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుంది.