Tollywood – Bollywood : హీరోయిన్ల కౌంటర్స్‌కి ఖంగుతినాల్సిందే.. మీడియాకా? దర్శకనిర్మాతలకా? హీరోలకా?

బాలీవుడ్ టు టాలీవుడ్ పలువురు హీరోయిన్లు ఈమధ్య అదిరిపోయే కౌంటర్స్ ఇస్తున్నారు. అయితే ఆ కౌంటర్స్ మీడియాకా? దర్శకనిర్మాతలకా? హీరోలకా? అనేది..

Tollywood – Bollywood : హీరోయిన్ల కౌంటర్స్‌కి ఖంగుతినాల్సిందే.. మీడియాకా? దర్శకనిర్మాతలకా? హీరోలకా?

Tollywood and Bollywood heroines counters in recent times

Updated On : May 12, 2023 / 3:58 PM IST

Tollywood – Bollywood : సినీ పరిశ్రమంలోని చాలామంది హీరోయిన్లు తమ పని తాము చూసుకుంటూ కాంట్రావర్సీలకు దూరంగా ఉంటూ కెరీర్ ని సాగిస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం తమ అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంటారు. అయితే వాళ్ళు మాట్లాడే మాటల్లో కొంత వాస్తవం కూడా ఉంటుంది. అలా రీసెంట్ టైమ్స్ లో కొందరు ముద్దుగుమ్మలు ఇచ్చి కౌంటర్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్‌బీర్ అండ్ అలియా భట్ (Alia Bhatt) ఇటీవలే పెళ్లి చేసుకొని తల్లిదండ్రులు అయిన విషయం కూడా తెలిసిందే. అయితే అలియా కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలో తల్లి అవ్వాలనే నిర్ణయం ఎందుకు తీసుకుందని అందరు ఆలోచించారు. ఇక ఈ విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూ అలియాని ప్రశ్నించగా, ఆమె బదులిస్తూ.. “రణ్‌బీర్ ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొంటాడు. అతని రాహాకు సంబంధించిన ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. మరి నన్ను అడిగిన ఈ ప్రశ్నని కూడా ఎందుకు అడగరు” అంటూ ప్రశ్నించింది.

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో ఇది మర్చిపోయారుగా!

ఇక మరో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.. భర్త నిక్ జోనాస్ ను కలవడానికి ముందు ఉన్న లవ్ స్టోరీస్ గురించి ప్రశ్నించగా, ఆమె బదులిస్తూ.. తన భర్త పెళ్ళికి ముందు చాలా మందిని ప్రేమించాడని, చాలా మందితో డేటింగ్ చేశాడని. అలాగే తను కూడా పెళ్లికి ముందు ఎంతోమందితో డేటింగ్ చేసినట్లు చెప్పిన ప్రియాంక.. ఆ గతం ఇప్పుడు అనవసరం అంటూ సీరియస్ కౌంటర్ ఇచ్చింది.

సౌత్ హీరోయిన్లు విషయానికి వస్తే.. రకుల్ ప్రీత్ సింగ్ కి (Rakul Preet Singh) ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేవు. అయినా సరి రెమ్యూనరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గేదే లేదంటోంది. ఈ విషయం గురించి ప్రశ్నించగా, రకుల్ బదులిస్తూ.. “టాలెంట్ ఆధారంగా నిర్ణయించాల్సిన రెమ్యూనరేషన్ ను స్టార్ డమ్ ఆధారంగా ఇస్తున్నారు. ఈ క్రమంలో హీరోలకుఎక్కువ పారితోషికం అందుతుంది” అని కామెంట్ చేస్తూ హీరోలకు ప్రతిభ లేకున్నా ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని ఇన్‌డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చింది.

Kushi : సమంతకి తెలియకుండా తనతోనే ఇన్‌స్టా రీల్ చేసిన విజయ్.. వీడియో వైరల్!

ఇక అనసూయ, విజయ్ దేవరకొండ ఫాన్స్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న గొడవ తెలిసిందే. ఇలా తనపై దాడి జరుగుతున్నా సంబంధిత హీరో గాని, ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు గాని రెస్పాండ్ అవ్వడం లేదని అనసూయ తన సోషల్ మీడియా ద్వారా హీరోలకు.. “ఫాలోయింగ్‌ పోతుందని ఆలోచిస్తున్నారా? అలాంటి ఫాలోయింగ్‌ లేకుంటేనే బెటర్‌ కదండీ” అంటూ ట్వీట్‌ చేసింది.

తమిళ యాక్ట్రెస్ ఐశ్వర్యా రాజేష్ (Aishwarya Rajesh) కూడా ఇటీవల ‘ఫ‌ర్హానా’ మూవీ ప్రమోషన్స్ లో అదిరిపోయే కౌంటర్ వేసింది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువ‌గా చేయ‌టానికి కారణమేంటి అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఇప్పుడు నాకు వేసిన ప్రశ్ననే మీరు హీరో ఓరియెంటెడ్ సినిమాలే చేస్తున్నారు? అని హీరోల‌ను వేయ‌గ‌ల‌రా? ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ హీరోయిన్స్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.