Pan India Films: పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ టాలీవుడ్.. స్ట్రాటజీ ఏంటంటే?

ఇప్పుడు తెలుగు సినిమా జస్ట్ రీజనల్ సినిమా కాదు.. పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. అయితే మొన్నటి వరకూ సౌత్ మీదే కంప్లీట్ గా కాన్సన్ ట్రేట్ చెయ్యని టాలీవుడ్ ఇప్పుడు..

Pan India Films: పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ టాలీవుడ్.. స్ట్రాటజీ ఏంటంటే?

Pan India Films

Updated On : January 8, 2022 / 4:29 PM IST

Pan India Films: ఇప్పుడు తెలుగు సినిమా జస్ట్ రీజనల్ సినిమా కాదు.. పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. అయితే మొన్నటి వరకూ సౌత్ మీదే కంప్లీట్ గా కాన్సన్ ట్రేట్ చెయ్యని టాలీవుడ్ ఇప్పుడు బాలీవుడ్ ని ఊపేస్తోంది. పాన్ ఇండియా సినిమాలు చాలా వస్తున్నా.. తెలుగు సినిమాలు మాత్రమే ఈ రేంజ్ లో సక్సెస్ అవ్వడానికి.. రీచ్ అవ్వడానికి రీజనేంటి..? ఇంతకీ తెలుగు సినిమా పాన్ ఇండియా స్ట్రాటజీ ఏంటి..?

Heroins: క్యారక్టర్ కోసం హోమ్ వర్క్.. ప్రెస్టీజియస్‌గా తీసుకుంటున్న హీరోయిన్స్

తెలుగు సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతోంది. అంతేకాదు.. బాలీవుడ్ సినిమాల్ని సైతం డామినేట్ చేసి బక్సాఫీస్ దగ్గర సత్తా చూపిస్తోంది. ఒకప్పుడు పాన్ ఇండియా మూవీ అంటే రాజమౌళి, బాహుబలి మాత్రమే కనిపించేవి.. కానీ ఇప్పుడు టాలీవుడ్ బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో రీజనల్, లాంగ్వేజ్ బ్యారియర్స్ దాటేస్తోంది. తెలుగు సినిమా పాన్ ఇండియా సక్సెస్ కి కారణాలేంటా అని తెగ ఆలోచిస్తున్నారు జనాలు.

Vijay Devarakonda: రెస్ట్ మోడ్‌లో రౌడీ హీరో.. అంతా కరోనా పుణ్యమే!

టాలీవుడ్ సినిమాని పాన్ ఇండియా మూవీగా సక్సెస్ చెయ్యడానికి రెండు ఫార్ములాల్ని ఫాలో అవుతోంది టాలీవుడ్. అగ్రెసివ్ గా సోషల్ మీడియా మార్కెటింగ్, మ్యాసివ్ గా ప్రమోట్ చెయ్యడం ఒకటైతే.. రీజనల్ స్టార్స్ ని.. పాన్ ఇండియా లెవల్లో సినిమాలోకి తీస్కోవడం మరోటి. ట్రిపుల్ఆర్ లో హిందీ నుంచి ఆలియాభట్, అజయ్ దేవ్ గన్, తమిళ్ నుంచి సముద్రఖని.. ఇలా స్టార్ కాస్ట్ అందర్నీ పాన్ ఇండియారేంజ్ లో పెట్టేస్తే.. సినిమా ఆల్ ఓవర్ ఇండియా చూస్తారనడంలో ఏమాత్రం డౌట్ లేదు. అంతేకాదు.. టాక్ షోలు, క్యాంపెయిన్స్ తో పాటు ప్రమోషన్లు కూడా టాప్ రేంజ్ లో ఏ తెలుగు సినిమాకీ చెయ్యనంతగా పాన్ ఇండియా వైడ్ గా 20 కోట్లతో ప్రమోషన్లు చేశారు మేకర్స్.

Shyam Singha Roy: ఓటీటీలో శ్యామ్ సింగరాయ్.. ఎప్పుడంటే?

రాజమౌళికి ముందు నుంచే పాన్ ఇండియా ఇమేజ్ ఉంది. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప సినిమాకి అసలు ఏమాత్రం హిందీ టచ్ లేదు. అలాంటిది బాలీవుడ్ లో 75 కోట్ల కలెక్షన్లకు రీచ్ అవుతోంది. ఈ సినిమాలో మళయాళం నుంచి ఫహాద్ ఫాజిల్ తప్ప.. బాలీవుడ్ స్టార్ కాస్ట్ లేదు.. కానీ అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఎందుకంటే.. బన్నీ హిందీ డబ్బింగ్ సినిమాలకు బాలీవుడ్ లో క్రేజ్ ఉంది. అంతేకాదు అలవైకుంఠపురంలో పాటలతో బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు బన్నీ. ఆక్రేజ్ ని క్యాష్ చేస్కోవడమే కాకుండా ప్రమోషన్లు కూడా పర్వాలేదనిపించడంతో సినిమా పాన్ ఇండియా వైడ్ గా సూపర్ హిట్ అయ్యింది.

Film Celebrities: సెలబ్రిటీలను చుట్టేస్తున్న కరోనా.. ఉదృతంగా వ్యాప్తి!

ఇక రాధేశ్యామ్ విషయానికొస్తే.. రాధేశ్యామ్ కి పీక్స్ లో ప్రమోషన్లు లేవు.. పాన్ ఇండియా స్టార్ కాస్ట్ అంతకన్నా లేదు. కానీ ఈ సినిమా మాత్రం ప్రభాస్ కి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ మీదనే పాన్ ఇండియా రిలీజ్ అవుతోంది. హీరోయిన్ గా పూజాహెగ్డే బాలీవుడ్ లో కూడా స్టార్ కాబట్టి.. అక్కడ సినిమాకి యాడ్ అయ్యే ఎలిమెంట్స్ లో అది కూడా ఒకటి. అంతేకాదు.. మ్యూజిక్ విషయంలో కూడా హిందీ వెర్షన్ కి సెపరేట్ చేయించడంతో ఈ అంశం కూడా పాన్ ఇండియా వైడ్ గా యాడ్ అయ్యే ఎలిమెంట్. ఇలా తెలుగు సినిమా పాన్ ఇండియా వైడ్ గా పక్కా స్ట్రాటజీతో తన ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తూ.. సక్సెస్ సాధిస్తోంది.