Plane Crash : గుజరాత్ విమాన ప్రమాదం.. మృతులకు సంతాపం తెలుపుతూ స్పందిస్తున్న టాలీవుడ్.. చిరు, చరణ్, ఎన్టీఆర్, బన్నీ..

టాలీవుడ్ హీరోలు, ప్రముఖులు కూడా గుజరాత్ ప్రమాదంపై స్పందిస్తూ ఈ ఘటనలో మరణించిన వారికి సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు.

Plane Crash : గుజరాత్ విమాన ప్రమాదం.. మృతులకు సంతాపం తెలుపుతూ స్పందిస్తున్న టాలీవుడ్.. చిరు, చరణ్, ఎన్టీఆర్, బన్నీ..

Tollywood Celebrities Reactions on Ahmedabad Plane Crash Incident

Updated On : June 12, 2025 / 7:10 PM IST

Plane Crash : గుజరాత్ అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మంది అగ్నికి ఆహుతయి చనిపోయి ఉంటారని అక్కడి అధికారులు అంటున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. గుజరాత్ విమాన ప్రమాదంపై దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు.

Also Read : Kannappa : గుజరాత్‌ విమాన ప్రమాదం.. క్యాన్సిల్ అయిన ‘కన్నప్ప’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్..

ఈ క్రమంలో టాలీవుడ్ హీరోలు, ప్రముఖులు కూడా గుజరాత్ ప్రమాదంపై స్పందిస్తూ ఈ ఘటనలో మరణించిన వారికి సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు.