కరోనాతో ప్రముఖ నటుడు కోసూరి కన్నుమూత

  • Published By: vamsi ,Published On : September 24, 2020 / 06:14 AM IST
కరోనాతో ప్రముఖ నటుడు కోసూరి కన్నుమూత

Updated On : September 24, 2020 / 10:17 AM IST

కరోనా కరాళ నృత్యానికి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా విషాదం చోటుచేసుకుంది. కరోనా కారణంగా ప్రముఖ సినీ, టీవీ నటుడు కోసూరి వేణుగోపాల్‌ చనిపోయారు. మర్యాద రామన్న, విక్రమార్కుడు, పిల్ల జమీందార్‌, ఛలో తదితర సినిమాల్లో నటించిన వేణుగోపాల్‌ తెలుగు ప్రేక్షక లోకాన్ని తన నటనతో నవ్వించారు.

కరోనా పాజిటివ్‌ రావడంతో 22 రోజులుగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన.. బుధవారం(23 సెప్టెంబర్ 2020) రాత్రి కన్నుమూశారు. వేణుగోపాల్‌ కుటుంబసభ్యులు కూడా అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.



పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్‌ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో నటిస్తుండేవారు. మర్యాద రామన్న, విక్రమార్కుడు, ఛలో, పిల్ల జమిందారు వంటి అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వేణుగోపాల్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.