OG Movie : అప్పుడు చిరంజీవితో.. ఇప్పుడు పవన్‌తో.. OGలో ఆ హీరో ముఖ్య పాత్ర..
అప్పుడు చిరంజీవితో కలిసి నటించిన ఆ హీరో.. ఇప్పుడు OG సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించబోతున్నాడు.

Tollywood hero who acted with chiranjeevi before is acted in Pawan Kalyan OG
OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మూవీ ‘OG’. గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాని సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంటే బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ గా కనిపించబోతున్నాడు. అలాగే తమిళ నటుడు అర్జున్ దాస్, శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ఒకప్పటి యంగ్ హీరో కూడా నటించబోతున్నాడని తెలిసిందే. ఈ విషయాన్ని ఆ హీరోనే బయట పెట్టాడు.
‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ వంటి లవ్ స్టోరీతో హీరోగా మంచి ఎంట్రీ ఇచ్చిన నటుడు ‘వెంకట్’. ఆ తరువాత ‘అన్నయ్య’ సినిమాలో చిరంజీవికి తమ్ముడిగా నటించి మంచి ఫేమ్‌నే సంపాదించుకున్నాడు. కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న ఈ నటుడు.. మళ్ళీ ఇప్పుడు వరుస ఆఫర్లు అందుకుంటూ వస్తున్నాడు. అలాగే OG సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్ర చేసే అవకాశం అందుకున్నాడట. ఆల్రెడీ అందుకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసినట్లు వెంకట్ చెప్పుకొచ్చాడు.
Also read : Renu Desai : పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేణు దేశాయ్
అలాగే సినిమా చాలా బిగ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నట్లు, ఇంకా చాలామంది యాక్టర్స్ సినిమాలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. తెలుగు ఇండస్ట్రీలో ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ ఫిలిం కానుందని పేర్కొన్నాడు. ప్రస్తుతం వెంకట్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అప్పుడు చిరంజీవి పక్కన కలిసి నటించిన వెంకట్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన కనిపించబోతున్నాడు అని తెలియడంతో మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ ఈ ఏడాది లేనట్లు ఇటీవల నిర్మాత అభిమానులకు ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
View this post on Instagram
Between the shoot video of #TheyCallHimOG #HungryCheetah pic.twitter.com/8sQ6MgTukl
— Satya (@YoursSatya) October 29, 2023