Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి నిక్ నేమ్ ఏంటో తెలుసా..?
టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిక్ నేమ్ ఏంటో తెలుసా..?

Tollywood Heroine Lavanya Tripathi reveals her nick name in miss perfect promotions
Lavanya Tripathi : టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. వరుణ్ తేజ్ ప్రేమ వివాహం చేసుకొని మెగా ఇంటికి కోడలిగా వెళ్లిన సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత కూడా యాక్టింగ్ కెరీర్ ని కొనసాగిస్తానని చెప్పిన లావణ్య.. రీసెంట్ గా ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రమోషన్స్ లో ఉన్న లావణ్య పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన నిక్ నేమ్ ఏంటో తెలియజేశారు.
చిన్నప్పటి నుంచి లావణ్యని అందరూ ‘చున్ చున్’ అని పిలిచేవారట. వినడానికి ‘చిన్ చాన్’ కార్టూన్ పేరులా ఉన్న ఈ పదం.. ఒక రైమ్ లోనిదట. చిన్నప్పుడు లావణ్య ఆ రైమ్ ని పడేవారట. ఆ సమయంలోనే ఫ్యామిలీ మెంబెర్స్ లావణ్యకి ఆ పేరుని పెట్టారంట. ఇక ఈ పేరు అంటే లావణ్యకి కూడా చాలా ఇష్టమంట. ఇప్పటికీ తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ తనని అలాగే పిలుస్తూ ఉంటారట.
Also read : Kalki 2898 AD : సినిమా రిలీజ్ అవ్వకుండానే.. మ్యూజిక్ కాన్సర్ట్‌లో ‘కల్కి’ సంగీతం ప్రదర్శన.. వీడియో వైరల్
ఇదే ఇంటర్వ్యూలో వరుణ్ తనకి ఎలా ప్రపోజ్ చేశారో కూడా తెలియజేశారు. ప్రేమ ప్రయాణంలో ఎలాంటి ప్రపోజల్స్ చేసుకోలేదట. ఎందుకంటే, ఇద్దరి నుంచి ఇష్టముందని తెలిసి లవ్ జర్నీలో ముందుకు వెళ్లారట. అయితే పెళ్ళి విషయంలో మాత్రం వరుణే ముందుగా ప్రపోజ్ చేశారట. కానీ లావణ్య పెళ్లి అంత దూరం ఆలోచించలేదట. అయితే తనకి కూడా పెళ్లి చేసుకోవాలనే ఒక చిన్న ఆలోచన మనసులో ఉండడంతో.. ఓకే చెప్పేశారట.
ఇక ఈ పెళ్లి ప్రపోజల్ ని వరుణ్ తేజ్ తన సూపర్ హిట్ మూవీ ‘తొలిప్రేమ’ స్టైల్‌లో చెప్పారట. ఆ మూవీ ఎండింగ్ లో రాశిఖన్నాకి రింగ్ ఇస్తూ పెళ్లి ప్రపోజల్ చేసినట్లు గానే.. లావణ్యకి కూడా రింగ్ ఇచ్చి పెళ్లి ప్రపోజల్ పెట్టారట. కాగా వీరిద్దరూ అంతరిక్షం, మిస్టర్ సినిమాల్లో కలిసి నటించారు. మిస్టర్ మూవీ టైంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. అప్పటినుంచి ఆ ప్రేమని రహస్యంగా మెయిన్‌టైన్ చేస్తూ వచ్చి పెళ్ళికి ముందు రివీల్ చేశారు.