సమంత హైదరాబాద్‌కు రావాలని ట్రోల్ చేయాలి: త్రివిక్రమ్ శ్రీనివాస్
అలియాభట్, వేదాంగ్ రైనా నటించిన జిగ్రా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో ఇవాళ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న త్రివిక్రమ్ మాట్లాడారు.

Trivikram Srinivas
హీరోయిన్ సమంతపై దర్శకుడు త్రివిక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ మాయ చేశావే నుంచే సమంత ఓ హీరో అని, ఆమెకు వేరే శక్తి అక్కర్లేదని, సమంతనే ఓ శక్తి అని అన్నారు. అలియాభట్, వేదాంగ్ రైనా నటించిన జిగ్రా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో ఇవాళ నిర్వహించారు.
ఇందులో పాల్గొన్న త్రివిక్రమ్ మాట్లాడుతూ.. “సమంత.. ముంబైలోనే ఉండకుండా హైదరాబాద్‌కు అప్పుడప్పుడు కూడా రండి.. మీరు చేయడం లేదని మీకు తగ్గ కథలు మేం రాయడం లేదు.. మీరు నటిస్తానంటే మేం రాస్తాం. అత్తారింటికి దారేది లాగా సమంత కోసం.. హైదరాబాద్‌కు రావడానికి దారేది అనాలేమో.. సమంత రావాలని ట్రోల్ చేయాలి” అని అన్నారు.
కాగా, అలియాభట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న జిగ్రా సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. జిగ్రా సినిమాకు వాసన్ బాలా దర్శకత్వం వహించారు.
Samantha: చాలా రోజుల తరువాత మీ ముందుకు వచ్చాను: సమంత