Unstoppable 2: అన్‌స్టాపబుల్ బాహుబలి ఎపిసోడ్-2 రిలీజ్ ప్రోమో.. సరదాలతో పాటు కష్టాన్ని పంచుకున్న ప్రభాస్!
నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ 2 బాహుబలి ఎపిసోడ్ పార్ట్-1ను ఇటీవల స్ట్రీమింగ్ చేయగా, ఆ రోజు ఎలాంటి రచ్చ జరిగిందో మనం చూశాం. ఆహా యాప్ క్రాష్ అయ్యేంతలా డార్లింగ్ ఫ్యాన్స్ ఆ ఎపిసోడ్‌ను వీక్షించేందుకు ఆసక్తిని చూపారు. ఇక బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కడంతో ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన పార్ట్ 2ను ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ చేస్తారా అని అభిమానులు ఆశగా చూస్తున్నారు.
Unstoppable 2: నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ 2 బాహుబలి ఎపిసోడ్ పార్ట్-1ను ఇటీవల స్ట్రీమింగ్ చేయగా, ఆ రోజు ఎలాంటి రచ్చ జరిగిందో మనం చూశాం. ఆహా యాప్ క్రాష్ అయ్యేంతలా డార్లింగ్ ఫ్యాన్స్ ఆ ఎపిసోడ్‌ను వీక్షించేందుకు ఆసక్తిని చూపారు. ఇక బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కడంతో ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన పార్ట్ 2ను ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ చేస్తారా అని అభిమానులు ఆశగా చూస్తున్నారు.
అయితే తాజాగా ఈ పార్ట్ 2కి సంబంధించి రిలీజ్ ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఈ కొత్త ప్రోమోలో ప్రభాస్ మరింత సరదాగా బాలయ్యతో ఫన్ చేస్తూ కనిపించాడు. అటు తన స్నేహితుడు గోపీచంద్‌ను ఏది చెప్పినా పూర్తిగా చెప్పాలని కోరతాడు. ఇక బాహుబలి తరువాత ప్రభాస్ మైండ్‌సెట్ ఏమిటని బాలయ్య ప్రశ్నించగా, తమ కష్టం గురించి చెప్పుకొచ్చాడు ప్రభాస్. సాహో మూవీ కోసం వారు ఎంతగా కష్టపడ్డారో చెప్పుకొచ్చాడు.
ఇక ఈ ఎపిసోడ్ పార్ట్ 2ను జనవరి 6న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆహా ఇప్పటికే అనౌన్స్ చేయగా, తాజాగా రిలీజ్ అయిన ప్రోమో ఈ పార్ట్ 2పై మరింతగా అంచనాలు పెంచేసింది. ఇక బాలయ్య ప్రభాస్, గోపీచంద్‌లతో ఎలాంటి వాస్తవాలను బయటపెట్టిస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.