Unstoppable 2: పండగపూట పవన్ అన్‌స్టాపబుల్ షో.. నిజమైన పండగ అంటోన్న అభిమానులు!
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 టాక్ షో ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. ఈ టాక్ షోలో పలువురు సెలబ్రిటీలు పాల్గొంటూ అభిమానులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ను అందిస్తున్నారు. ఇక తాజాగా అన్‌స్టాపబుల్ టాక్ షోకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గెస్టుగా రాగా, ఈ ఎపిసోడ్‌ను భారీ సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన రెండో భాగాన్ని జనవరి 6న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆహా తెలిపింది.
Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 టాక్ షో ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. ఈ టాక్ షోలో పలువురు సెలబ్రిటీలు పాల్గొంటూ అభిమానులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ను అందిస్తున్నారు. ఇక తాజాగా అన్‌స్టాపబుల్ టాక్ షోకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గెస్టుగా రాగా, ఈ ఎపిసోడ్‌ను భారీ సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన రెండో భాగాన్ని జనవరి 6న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆహా తెలిపింది.
అయితే ఈ టాక్ షోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా తాజాగా పాల్గొన్నాడు. ఆయన ఎపిసోడ్ కోసం ప్రేక్షకులతో పాటు అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. అయితే ఈ పవర్ఫుల్ ఎపిసోడ్‌ను ఏరోజున స్ట్రీమింగ్ చేస్తారా అనే విషయంపై ఆహా ఓ క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ పాల్గొన్న అన్‌స్టాపబుల్ 2 ఎపిసోడ్‌ను సంక్రాంతి కానుకగా జనవరి 13న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. పండగపూట ఈ ఎపిసోడ్‌కు మంచి ప్రేక్షకాదరణ దక్కుతుందని షో నిర్వాహకులు భావిస్తున్నారట.
ఇక ఈ ఎపిసోడ్లో పవన్‌తో పాటు స్టార్ డైరెక్టర్స్ త్రివిక్రమ్, క్రిష్‌లు కూడా కనిపించనున్నారు. మరి ఈ పవర్ ప్యాక్డ్ ఎపిసోడ్‌ను నిజంగానే సంక్రాంతి కానుకగా జనవరి 13న స్ట్రీమింగ్ చేస్తారా అనే విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.