Unstoppable with NBK : అన్‌స్టాపబుల్ నెక్స్ట్ ఎపిసోడ్‌కి వచ్చేది వాళ్లే..
అన్‌స్టాపబుల్ మూడో ఎపిసోడ్ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. మరి ఈ మూడో ఎపిసోడ్ లో అతిథులు ఎవరు..?

Unstoppable with NBK third episode guests promo released
Unstoppable with NBK : ఓటీటీ రంగంలో సరికొత్త రికార్డులని సృష్టించిన అన్‌స్టాపబుల్ విత్ NBK ఇటీవల సీజన్ 3 మొదలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. మొదటి ఎపిసోడ్‌లో భగవంత్ కేసరి టీం కాజల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, అనిల్ రావిపూడి వచ్చి సందడి చేస్తే.. రెండో ఎపిసోడ్ లో ‘యానిమల్’ మూవీ టీం రణబీర్, రష్మిక మందన్న, సందీప్ వంగ వచ్చారు. ఇప్పుడు మూడో ఎపిసోడ్ రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఆల్రెడీ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. మరి ఈ మూడో ఎపిసోడ్ లో అతిథులు ఎవరు..?
ఈ కొత్త ఎపిసోడ్ లో ఒకప్పుడు బాలయ్యతో కలిసి పని చేసిన సెలబ్రిటీస్ సందడి చేయబోతున్నారు. మంగమ్మగారి మనవడు సినిమాలో బాలయ్యకి హీరోయిన్ నటించిన సుహాసిని.. మరోసారి ‘దంచవె మెనత్తా కూతురా’ డేస్ ని రిపీట్ చేసేందుకు అన్‌స్టాపబుల్ లో సందడి చేయబోతున్నారు. అలాగే చెన్నకేశవరెడ్డి, పైసా వసూల్, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో బాలయ్యకి జోడిగా కనిపించిన శ్రియా మూడో ఎపిసోడ్ లో గెస్టుగా రాబోతున్నారు. ఈ అందాల తారలతో పాటు టాలీవుడ్ దర్శకులు కూడా ఈ కొత్త ఎపిసోడ్ లో భాగం కాబోతున్నారు.
Also read : Rana Daggubati : రానా బర్త్ డే స్పెషల్.. భల్లాలదేవ నుంచి రాక్షస రాజా హిరణ్యకశిపుడు వరకు..
View this post on Instagram
బాలయ్యతో లక్ష్మీనరసింహ, అల్లరి పిడుగు వంటి హిట్ సినిమాలు తెరకెక్కించిన జయంత్ సి పరాన్జీ ఈ ఎపిసోడ్ గెస్ట్ గా వస్తున్నారు. అలాగే ప్రస్తుత మాస్ కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఈ షోలో పాల్గొన్నబోతున్నారు. ఈ అతిథులను పరిచయం చేస్తూ ఒక చిన్న వీడియోని రిలీజ్ చేశారు. అయితే ఈ ఎపిసోడ్ రిలీజ్ డేట్ ని మాత్రం అనౌన్స్ చేయలేదు. కాగా ఈ ఎపిసోడ్ లో పాల్గొన్న హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక దర్శకుడు జయంత్ తెలుగులో చివరిగా డైరెక్ట్ చేసిన మూవీ పవన్ ‘తీన్‌మార్’. దీంతో ఈ ఎపిసోడ్ పై పవన్ అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకుంది.