Urvashi Rautela : ఆ గౌరవం అందుకున్న తొలి నటిగా ఊర్వశి రౌతేలా.. రిషబ్ పంత్ పేరుతో..
ఊర్వశి రౌతేలా భారతీయ మొట్టమొదటి నటిగా అరుదైన గౌరవం అందుకుంటే నెటిజెన్స్.. రిషబ్ పంత్ దృష్టిలో పడేందుకేనా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఊర్వశి..

Urvashi Rautela LAUNCH CRICKET WORLD CUP 2023 TROPHY Rishabh Pant
Urvashi Rautela : బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా.. ఇటీవల ఐటెం సాంగ్స్ తో టాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అఖిల్ అక్కినేని సినిమాల్లో కనిపించి ఆడియన్స్ ని ఉర్రూతలూగించింది. కాగా ఈ భామ సినిమాలతోనే కాకుండా భారత్ క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) విషయంలో కూడా నెటిజెన్స్ లో మంచి ఫేమ్ ని సంపాదిందుకుంది. వీరిద్దరి మధ్య ఒక ప్రేమ రూమర్ అప్పటిలో బాగా వైరల్ అవ్వడం, దానిపై రిషబ్ అండ్ ఊర్వశి తమ సోషల్ మీడియాలో ఇన్‌డైరెక్ట్ పోస్టులతో వాదించుకోవడం హాట్ టాపిక్ అయ్యాయి.
Samantha : ఒంటరిగా జీవించడం అరుదైన బహుమతి.. అవకాశం వస్తే వదులుకోకండి.. సమంత పోస్ట్ వైరల్..!
ఇక అప్పటి నుంచి నెటిజెన్స్ ఊర్వశి ప్రతి విషయంలో రిషబ్ పంత్ పేరుని తీసుకు వస్తుంటారు. తాజాగా ఈ భామ ఒక అరుదైన గౌరవం అందుకుంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఒక పోస్ట్ వేయగా.. దాని కామెంట్స్ లో కూడా రిషబ్ పంత్ పేరుతో నెటిజెన్స్ ఆడేసుకుంటుంటారు. ఇంతకీ ఆ గౌరవం ఏంటంటే.. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఇండియా వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టోర్నీ ప్రారంభం అవ్వడానికంటే ముందు ట్రోఫీని అన్ని దేశాల్లో తిప్పి తీసుకు వస్తారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫ్రాన్స్ లోని ఈఫిల్ టవర్ ముందు ఆ 2023 ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరించారు.
Raashii Khanna : సాయి ధరమ్ తేజ్ కోసం రాశి ఖన్నా ఏం పాడింది భయ్యా.. ఆ వాయిస్‌లో ఏదో మ్యాజిక్..
ఈ ఆవిష్కరణ ఊర్వశి రౌతేలా చేతులు మీదుగా జరిగింది. ఈ గౌరవం అందుకున్న మొట్టమొదటి భారతీయ నటి ఊర్వశి కావడం విశేషం. ఇక ఆ ట్రోఫీతో ఈఫిల్ టవర్ ముందు అదిరిపోయే ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగి వాటిని షేర్ చేసింది. అయితే ఇవి చూసిన నెటిజెన్స్.. రిషబ్ పంత్ దృష్టిలో పడేందుకేనా? వరల్డ్ కప్ ఇప్పుడు ఊర్వశి రౌతేలా చేతిలో, నెక్స్ట్ రిషబ్ చేతిలో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
View this post on Instagram