Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్‌సింగ్ ఫస్ట్ లుక్ ఆ రోజున వస్తుందా..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ నుండి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Ustaad Bhagat Singh Glimpse To Be Out On This Special Day
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ కావడంతో, ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
Ustaad Bhagat Singh : ఉస్తాద్ నుంచి అదిరే అప్డేట్ ఇచ్చిన పవన్.. 8 రోజుల్లోనే!
కాగా ఈ సినిమా నుండి ఓ సాలిడ్ అప్డేట్‌ను త్వరలో ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో హరీష్ శంకర్ – పవన్ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్‌సింగ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అప్పట్లో ఈ మూవీ పవన్ కల్యాణ్‌కు కావాల్సిన సాలిడ్ సక్సెస్‌ను అందించింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 11 ఏళ్లు కావస్తుంది. మే 11న ఈ సినిమా 11 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ స్పెషల్ రోజున ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఓ గ్లింప్స్‌ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
మరోసారి గబ్బర్ సింగ్ కాంబినేషన్ సెట్ కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అందుకే, గబ్బర్ సింగ్ స్పెషల్ రోజున ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ను సంతోషపెట్టాలని హరీష్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. మరి నిజంగానే మే 11న ఉస్తాద్ భగత్ సింగ్ నుండి గ్లింప్స్ రిలీజ్ చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.