Ustaad Bhagat Singh : పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..
తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మొదటి పాట అప్డేట్ ఇచ్చారు. (Ustaad Bhagat Singh)
Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమాలో శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ పాటకు అదిరిపోయే డ్యాన్స్ వేసాడని మూవీ యూనిట్ తో పాటు అందరూ చెప్తున్నారు. గతంలోనే దానికి సంబంధిచిన స్టైలిష్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేసారు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మొదటి పాట అప్డేట్ ఇచ్చారు.
Also Read : Hyper Aadi : అమ్మాయిల మీద పడి ఏడుస్తాడు.. ఈగోకి వెళ్తాడు.. హైపర్ ఆదిపై ఇంద్రజ కామెంట్స్ వైరల్..
ఈ సినిమాలోని మొదటి పాట ప్రోమోని డిసెంబర్ 9 సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఆ ప్రోమోతో పాటు ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ బ్లాక్ కలర్ స్టైలిష్ అవుట్ ఫిట్ లో ఉన్న పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు.

ఈ పాట దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో భాస్కర భట్ల రాయగా విశాల్ దద్లాని పాడారు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ పాట కోసం ఎదురుచూస్తున్నారు.
Also See : Suriya 47 : సూర్య కొత్త సినిమా ఓపెనింగ్.. ఫొటోలు..
