Baby Movie : మొదటి సినిమాతోనే 65 అడుగులు పెయింటింగ్.. వైష్ణవి చైతన్య డెబ్యూట్ మాములుగా లేదుగా!
బేబీ సినిమాతో హీరోయిన్ గా డెబ్యూట్ ఇస్తున్న వైష్ణవి చైతన్య.. మొదటి సినిమాతోనే 65 అడుగులు పెయింటింగ్ ని ఒక సాంగ్ ప్రమోషన్ కోసం..

Vaishnavi Chaitanya 65 feet painting for Baby movie song promotion
Vaishnavi Chaitanya Baby : నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ కలర్ ఫోటోకి కథని అందించిన సాయి రాజేష్ దర్శకుడిగా పరిచయం అవుతూ చేస్తున్న సినిమా ‘బేబీ’. టాలీవుడ్ యూను హీరోలు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) ఈ సినిమాలో నటిస్తున్నారు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యాక్ట్రెస్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. కలర్ ఫొటో లాగానే ఈ సినిమాని కూడా గుండెకు హత్తుకునే ప్రేమకావ్యంలా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు దర్శకుడు సిద్ధం చేస్తున్నాడు.
Baby Movie : ‘బేబీ’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ స్టార్ సింగర్.. సూపర్ అంటున్న మ్యూజిక్ లవర్స్!
ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ అండ్ సాంగ్స్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి మూడు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. మూడు సాంగ్స్ సూపర్ హిట్టుగా నిలిచాయి. ఇక మూడో రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కోసం ఒక ప్రమోషనల్ వీడియోని చేశారు. ఆ వీడియో కోసం 65 అడుగులు ఎత్తు వైష్ణవి చైతన్య పెయింటింగ్ ని వేశారు మేకర్స్. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Baby Movie Song Launch Event : ‘బేబీ’ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్.. సందడి చేసిన రష్మిక..
ఈ సినిమా కథ మొత్తం వైష్ణవి చైతన్య చుట్టూ తిరగనుంది అని తెలుస్తుంది. డైరెక్టర్ మారుతి, SKN కలిసి మాస్ మూవీ మేకర్స్ పతాకం పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. విజయ్ బూల్గ్‌నిన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే వైష్ణవి చైతన్య.. మరో మూడు సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్నట్లు సమాచారం.