Vakeel Saab: దర్శక, నిర్మాతలకు మెగాస్టార్ చిరు సత్కారం!

వకీల్ సాబ్ సినిమాను ప్రేక్షకులు, విశ్లేషకులే కాదు.. ఇండస్ట్రీలో మిగతా హీరోలు.. తోటి స్టార్స్ కూడా తెగపొగిడేస్తున్నారు. మెగా కుటుంబమైతే ఇంటిల్లిపాది సినిమాను చూసి పవన్ నటనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సినిమా చూసిన అనంతరం మెగాస్టార్ వకీల్ సాబ్ దర్శక నిర్మాతలను సత్కరించారు.

Vakeel Saab: దర్శక, నిర్మాతలకు మెగాస్టార్ చిరు సత్కారం!

Vakeel Saab Megastar Pays Tribute To Vakeel Saab Director And Producers

Updated On : April 11, 2021 / 6:34 PM IST

Vakeel Saab: ఇప్పుడు టాలీవుడ్ లో ఏం నడుస్తుందంటే పవర్ స్టార్ వకీల్ సాబ్ మేనియా నడుస్తుందని చెప్తున్నారు. కరోనా తర్వాత స్తబ్ధుగా ఉన్న తెలుగు సినిమాకు క్రాక్ కాస్త కీ ఇస్తే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పరిగెత్తిస్తుంది. అసలే పాన్ ఇండియా స్థాయి సినిమాలు సిద్ధమవుతున్నా కరోనా భయం వెంటాడుతుండడంతో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతూ వచ్చాయి. కానీ ప్రేక్షకుల మనసులో స్థానముంటే ఏ కరోనా ఆపలేవని వకీల్ సాబ్ నిరూపించుకున్నాడు. భారీ కలెక్షన్లలో దూసుకెళ్తున్న ఈ సినిమా రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇదిలా ఉండగా వకీల్ సాబ్ సినిమాను ప్రేక్షకులు, విశ్లేషకులే కాదు.. ఇండస్ట్రీలో మిగతా హీరోలు.. తోటి స్టార్స్ కూడా తెగపొగిడేస్తున్నారు. మెగా కుటుంబమైతే ఇంటిల్లిపాది సినిమాను చూసి పవన్ నటనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అమ్మ అంజనా దేవి, భార్య సురేఖ, ఇతర ఫ్యామిలీ మెంబర్స్‌లో కలిసి ‘వకీల్ సాబ్’ చూసిన మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత పవన్ లోని నటుడిని ఈ సినిమాలో చూశానంటూ ఆనందం వ్యక్తం చేశారు. తల్లి అంజనాదేవి కూడా పవన్ నటనను చూసి గొప్పగా ఫీలయ్యారని చెప్పారు.

సినిమా చూసిన అనంతరం మెగాస్టార్ వకీల్ సాబ్ దర్శక నిర్మాతలను సత్కరించారు. నిర్మాత దిల్ రాజుతో పాటు దర్శకుడు శ్రీరామ్ వేణు‌లకు పుష్ప గుచ్ఛం ఇచ్చి అభినందించిన చిరు తమ్ముడితో ఇటువంటి సందేశాత్మక చిత్రం చేసినందకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు మెగా అభిమానులు కూడా వకీల్ సాబ్ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్ల నుండి దర్శక, నిర్మాతలను ఆకాశానికి ఎత్తేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. తమ హీరోను ఎలా చూడాలనుకున్నామో అలా చూపించిన వారికి కృతజ్ఞతల వర్షం కురిపిస్తున్నారు. ఓ అభిమాని థియేటర్లోనే నిర్మాత దిల్ రాజు కాళ్ళు మొక్కి తన భావాన్ని తెలియజేశాడు.

read: Vakeel Saab Collections: బాక్సాఫీస్ లెక్క తెలుస్తాడా?