Vamsi Nanduri : ‘మా ఇంటి బంగారం’లో సమంతతో కొట్టించుకున్న నటుడు.. ఎవరో తెలుసా? జబర్దస్త్ కమెడియన్ కి ఏమవుతాడంటే..?
సినిమా మొత్తానికి సమంత ఇతన్ని గరిటెతో కొట్టే సీన్ హైలెట్ గా నిలిచి ప్రేక్షకులను మెప్పించింది. దీంతో ఇతను ఎవరా అని ఆరా తీస్తున్నారు. (Vamsi Nanduri)

ఇటీవల సమంత మా ఇంటి బంగారం సినిమాతో వచ్చి హిట్ కొట్టింది. ఈ సినిమాలో సమంత యాక్షన్ సీక్వెన్స్ లతో అదరగొట్టింది.

అయితే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో సమంత వెనకే ఫాలో అయి ఆమెతో తిట్టించుకోవడం, ట్రైలర్ చివర్లో హైలెట్ అయిన సీన్.. సమంతతో పెద్ద గరిటెతో కొట్టించుకోవడం, ఆమెతో ఫైట్ చేయడం, చివర్లో చనిపోవడం.. ఇలాంటి సీన్స్ లో తన యాక్టింగ్ తో ఈ నటుడు ఒక్కసారిగా వైరల్ అయ్యాడు.

సీరియస్ యాక్టింగ్ లో, యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా నవ్వించి, క్లైమాక్స్ చనిపోయే సీన్ లో కూడా నవ్వించి మా ఇంటి బంగారం సినిమాలో హైలెట్ గా నిలిచాడు. సినిమా మొత్తానికి సమంత ఇతన్ని గరిటెతో కొట్టే సీన్ హైలెట్ గా నిలిచి ప్రేక్షకులను మెప్పించింది. దీంతో ఇతను ఎవరా అని ఆరా తీస్తున్నారు.

ఇతని పేరు వంశీ. ఇతను ఎవరో కాదు జబర్దస్త్ స్టార్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ అన్నయ్య. జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోలు, సినిమాలతో, బిగ్ బాస్ తో కమెడియన్ గా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు ఇమ్మాన్యుయేల్.

ఇప్పుడు తమ్ముడి బాటలోనే వంశీ నటుడిగా ప్రయత్నించి తొలి సినిమానే సమంత పక్కన యాక్ట్ చేయడం, చాలా సీన్స్ లో కనిపించడం, నెగిటివ్ షేడ్స్, కామెడీ చూపించి ప్రేక్షకులను మెప్పించడం చేసాడు.

ఈ సినిమా తర్వాత వంశీకి విలన్ గా, కమెడియన్ గా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మరో పక్క వంశీ దర్శకుడిగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం


Vamsi Nanduri
