Vanitha Vijaykumar : ఆయన నా మూడో భర్త కాదు.. రిలేషన్ లో ఉంటే పెళ్లి అయినట్టు కాదు..

వనిత కొన్ని రోజులు రిలేషన్ మెయింటైన్ చేసిన పీటర్ పాల్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇటీవల పీటర్ పాల్ చనిపోవడంతో తమిళ మీడియా, చానల్స్ అన్నీ కూడా వనిత మూడో భర్త మరణం అని రాశారు, అలాగే ప్రమోట్ చేశారు.

Vanitha Vijaykumar : ఆయన నా మూడో భర్త కాదు.. రిలేషన్ లో ఉంటే పెళ్లి అయినట్టు కాదు..

Vanitha Vijaykumar sensational post regarding her relation

Updated On : May 3, 2023 / 8:06 AM IST

Vanitha Vijaykumar :  వనిత విజయ్ కుమార్ తెలుగు వాళ్ళకి అంతగా తెలియకపోయినా తమిళ్(Tamil) లో మాత్రం ఎప్పుడూ వార్తల్లో ఉండే పేరు. తెలుగులో(Telugu) దేవి(Devi) సినిమాతో వనితా విజయ కుమార్ పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది. తమిళ్ లో సినిమాలు, సీరియల్స్, బిగ్ బాస్(BiggBoss) తో పాపులారిటీ తెచ్చుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు విజయ్ కుమార్(Vijay Kumar) కూతురిగా వనితా అందరికి పరిచయం. అయితే ఈమె సినిమాల కంటే కూడా గత కొన్నేళ్లుగా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది.

తండ్రితో ఆస్తి గొడవలు పెట్టుకోవడం, ఫ్యామిలీకి దూరంగా ఉండటం, ఇద్దర్ని పెళ్లి చేసుకొని విడిపోవడం, మూడో వ్యక్తితో రిలేషన్ లో ఉండటం.. ఇలాంటి చర్యలతో వనిత తమిళ్ వార్తల్లో రెగ్యులర్ గా నిలుస్తుంది. ఇటీవల వనిత కొన్ని రోజులు రిలేషన్ మెయింటైన్ చేసిన పీటర్ పాల్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇటీవల పీటర్ పాల్ చనిపోవడంతో తమిళ మీడియా, చానల్స్ అన్నీ కూడా వనిత మూడో భర్త మరణం అని రాశారు, అలాగే ప్రమోట్ చేశారు. దీనిపై వనిత విజయకుమార్ తాజాగా స్పందిస్తూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.

వనిత విజయ్ కుమార్ తన పోస్ట్ లో.. పీటర్ పాల్ మృతిపై మీడియా వాళ్ళు రాసే వార్తపై స్పందించాలా వద్దా అనుకున్నాను, చాలా ఓపిక పట్టాను. కానీ మీడియా మరింత ఓవర్ గా రాస్తున్నారు. అందుకే స్పందిస్తున్నాను. పీటర్ పాల్ తో నాకు న్యాయబద్దంగా వివాహం జరగలేదు. అతను నా భర్త కాదు. మేము కొన్ని నెలలు రిలేషన్ షిప్ లో ఉన్నాం అంతే. అది కూడా 2020 లోనే ముగిసిపోయింది. అంతమాత్రాన అతను నా భర్త అవ్వడు. వనిత విజయ్ కుమార్ మూడో భర్త మరణించాడు అనే వార్తలు రాయడం ఆపేయండి. నాకు భర్త లేడు, నేను ఒంటరిగానే ఉంటున్నాను. ఏ విషయానికి నేను బాధపడట్లేదు. ప్రస్తుతం నేను సంతోషంగా జీవిస్తున్నాను అని పోస్ట్ చేసింది. చివర్లో ఇట్లు.. మిస్ వనిత విజయ్ కుమార్ అని పెట్టడం గమనార్హం.

Agent : అయ్యగారి ఏజెంట్ అప్పుడే ఓటీటీలోకా.. మరీ ఇంత తక్కువ టైంలోనా.. డబ్బులు బొక్క అంటూ ట్రోల్స్..

దీంతో వనిత రాసిన ఈ పోస్ట్, ఆమె చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో వైరల్ గా మారాయి. మరోసారి వనితపై పలువురు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇక వనితకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారితో వనిత ప్రస్తుతం సపరేట్ గా నివసిస్తుంది. వనిత ప్రస్తుతం తెలుగులో సీనియర్ నటుడు నరేష్ చేస్తున్న మళ్ళీ పెళ్లి సినిమాలో నటిస్తుంది.