Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్ కుమార్ కొత్త సినిమా.. పోలీస్ పాత్రలో మరోసారి..

నేడు ఈ సినిమా నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు.

Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్ కుమార్ కొత్త సినిమా.. పోలీస్ పాత్రలో మరోసారి..

Varalaxmi Sarathkumar First Look Released from Police Complaint Movie

Updated On : May 30, 2025 / 10:10 PM IST

Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీగా ఉంది. సౌత్ లో అన్ని భాషల్లో సినిమాలు చేస్తుంది. తాజాగా తెలుగులో మరో కొత్త సినిమా అనౌన్స్ చేసింది. ‘పోలీస్ కంప్లెయింట్’ అనే టైటిల్ తో ఈ సినిమా రానుంది. నేడు ఈ సినిమా నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మూవీ యూనిట్ నేడు ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

Also Read : Balakrishna : బాలయ్య మ్యాన్షన్ హౌజ్ యాడ్ చూశారా..? సింహం మీద సవారి.. అదిరిందిగా..

అలాగే.. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ మీద స్పెషల్ సాంగ్ షూట్ చేసామని, అది సినిమాకే మెయిన్ హైలెట్ అని నిర్మాతలు తెలిపారు.

Varalaxmi Sarathkumar

ఈ సినిమాని ఎమ్మెస్కె ప్రమిదశ్రీ ఫిలిమ్స్, శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా సంస్థల బ్యానర్లలో సింగపూర్ బాలకృష్ణ, మల్లెల ప్రభాకర్ సంయుక్త నిర్మాణంలో సంజీవ్ మేగోటి డైరెక్టర్ గా తెరకెక్కిస్తున్నాడు. నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం, అమిత్, దిల్ రమేష్, రాజశ్రీ నాయర్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.