Varanasi : 2027 లో రిలీజయ్యే సినిమాకు ఇప్పుడే ప్రమోషన్స్ ఏంటి రాజమౌళి..? ఫోటో వైరల్..
ఈ సినిమాని 2027 సమ్మర్లో రిలీజ్ చేస్తారని కూడా ప్రకటించారు.(Varanasi)
Varanasi
Varanasi : రాజమౌళి – మహేష్ బాబు సినిమాకు వారణాసి అనే టైటిల్ ఇటీవల భారీ ఈవెంట్ పెట్టి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా హాజరయ్యారు. ఇక ఈ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ సినిమాని 2027 సమ్మర్లో రిలీజ్ చేస్తారని కూడా ప్రకటించారు.(Varanasi)
వారణాసి సినిమా 40 శాతం షూటింగ్ కూడా పూర్తయింది. త్వరలో నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ మొదలు కానుంది. అయితే తాజాగా మహేష్ – ప్రియాంక చోప్రా – పృథ్వీ రాజ్ సుకుమారన్ ముగ్గురు ఓ ఇంటర్వ్యూలో కూర్చున్న ఫోటో వైరల్ గా మారింది. దీంతో 2027 లో రిలీజయ్యే సినిమాకు రాజమౌళి ఇప్పుడే ప్రమోషన్స్ చేస్తున్నాడేంటి అని ఆశ్చర్యపోతున్నారు అంతా.
Also Read : Rakendu Mouli : బన్నీ వాసు అలా.. రాకేందు మౌళి ఇలా.. హిట్ అయినా కనీసం గుర్తింపు ఇవ్వలేదు.. సంచలన వ్యాఖ్యలు..
అసలే రాజమౌళి ప్రమోషన్స్ ఎక్కువ చేయడు. అలాంటిది 2027 లో రిలీజయ్యే సినిమాకు, షూటింగ్ అవ్వని సినిమాకు ఇప్పుడే ఇంటర్వ్యూలు చేస్తున్నారా అనే చర్చ మొదలయింది. అయితే ఈ మహేష్, ప్రియాంక,పృథ్వీ రాజ్ ఉన్న ఈ ఫోటో కొంతమంది హాలీవుడ్ ప్రమోషన్స్ అని అంటున్నారు. మరికొంతమంది మొన్న ఈవెంట్లోనే రికార్డెడ్ ఇంటర్వ్యూ అని తర్వాత రిలీజ్ చేస్తారని అంటున్నారు. మరి దీనిపై వారణాసి టీమ్ ఏం స్పందిస్తుందో, అసలు ఇది ఏం ఇంటర్వ్యూ నో, ఇలా ఆముగ్గురు ఎక్కడ కూర్చున్నారో తెలియాలంటే ఎదురుచూడాల్సిందే.
