Varsham Re Release: వర్షం రీ రిలీజ్.. దయచేసి థియేటర్లు నాశనం చేయకండి..

"ఈశ్వర్" సినిమాతో తన సినీ కెరీర్ ను ఆరంభించిన ప్రభాస్ ఈ నెల 11తో కరెక్ట్ గా 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా ప్రభాస్ నటించిన 'వర్షం' సినిమాను రీ రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. కాగా ఇటీవల ప్రభాస్ పుట్టినరోజున బిల్లా చిత్రాన్ని రీ రిలీజ్ చేయగా, అభిమానులు అత్యుత్సహంతో థియేటర్ లోని కుర్చీలను తగబెట్టిన సంగతి తెలిసిందే. దీంతో నట్టి కుమార్..

Varsham Re Release: వర్షం రీ రిలీజ్.. దయచేసి థియేటర్లు నాశనం చేయకండి..

Varsham Re Release

Updated On : November 7, 2022 / 5:19 PM IST

Varsham Re Release: “ఈశ్వర్” సినిమాతో తన సినీ కెరీర్ ను ఆరంభించిన ప్రభాస్ ఈ నెల 11తో కరెక్ట్ గా 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా ప్రభాస్ నటించిన ‘వర్షం’ సినిమాను రీ రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. డార్లింగ్ కెరీర్ ఒక మలుపు తీసుకోవడంలో ఈ సినిమా ముఖ్య పాత్ర పోషించింది అనే చెప్పాలి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష హీరో హీరోయిన్లుగా, గోపీచంద్ ప్రతి నాయకుడిగా శోభన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకాభిమానులను ఎంతగానో అలరించింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం అల్ టైం ఫేవరెట్ అనే చెప్పాలి.

Prabhas: నెట్‌ఫ్లిక్స్ చేసిన పనికి వరల్డ్ వైడ్‌గా ట్రోలింగ్‌కి గురవుతున్న ప్రభాస్.. కోపంలో డార్లింగ్ ఫ్యాన్స్..

ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ “వర్షం” సినిమాను తమ నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ తరపున రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేశాడు. ఇప్పటికే ఆన్ లైన్ లో టిక్కెట్ల బుకింగ్ మొదలయ్యిందని, స్పీడ్ గా టిక్కెట్లు బుక్ అవుతూ, విశేష స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. కాగా ఇటీవల ప్రభాస్ పుట్టినరోజున బిల్లా చిత్రాన్ని రీ రిలీజ్ చేయగా, అభిమానులు అత్యుత్సహంతో థియేటర్ లోని కుర్చీలను తగబెట్టిన సంగతి తెలిసిందే.

దీంతో నట్టి కుమార్.. తమ అభిమాన హీరోల సినిమాలను ప్రదర్శించే థియేటర్లను ఆయా హీరోల అభిమానులంతా దేవాలయాలు మాదిరిగా భావించి, వాటిని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశాడు. కొన్ని ప్రాంతాలలో సినిమాల విడుదల సందర్భంగా అభిమానుల కోలాహలంలో థియేటర్లు డామేజ్ అయిన సంఘటనలు జరిగాయని, దయచేసి అభిమానులు తమ కోలాహలాన్ని కొనసాగిస్తూనే, థియేటర్లను దేవాలయాలు మాదిరిగా కాపాడుకోవాలని నట్టి కుమార్ అందరు హీరోల అభిమానులకు పిలుపునిచ్చాడు.