Constable Song : వరుణ్ సందేశ్ కోసం.. నల్గొండ గద్దర్ నర్సన్న పాడిన కానిస్టేబుల్ సాంగ్ విన్నారా..?

తాజాగా కానిస్టేబుల్ సినిమా టైటిల్ సాంగ్ రిలీజ్ చేసారు.

Constable Song : వరుణ్ సందేశ్ కోసం.. నల్గొండ గద్దర్ నర్సన్న పాడిన కానిస్టేబుల్ సాంగ్ విన్నారా..?

Varun Sandesh Constable Movie Title Song Released Sing by Nalgonda Gaddar Narsanna

Updated On : January 26, 2025 / 4:31 PM IST

Constable Song : వరుణ్ సందేశ్ చాలా ఏళ్ళ తర్వాత ఇటీవల నింద సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు. త్వరలో కానిస్టేబుల్ అనే సినిమాతో రాబోతున్నాడు. వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై బలగం జగదీష్ నిర్మాణంలో ఈ కానిస్టేబుల్ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా టైటిల్ సాంగ్ రిలీజ్ చేసారు.

Also Read : Vijay Deverakonda : మొదలైన VD14 సినిమా.. యోధుడిగా విజయ్ దేవరకొండ.. భారీ సెట్ కోసం..

‘కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న…కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నా.. ‘ అంటూ సాగే టైటిల్ సాంగ్ ను శ్రీనివాస్ తేజ రాయగా సుభాష్ ఆనంద్ సంగీత దర్శకత్వంలో నల్గొండ గద్దర్ నర్సన్న పాడారు. ఈ సాంగ్ ని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సి.వి.ఆనంద్ చేతుల మీదగా రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ టైటిల్ సాంగ్ వినేయండి…

ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ సి.వి.ఆనంద్ మాట్లాడుతూ.. మా కానిస్టేబుల్స్ అంటే నాకు ఇష్టం. వాళ్ళ మీద సినిమా, సాంగ్ రావడం ఆనందంగా ఉంది. ఈ టైటిల్ సాంగ్ చాలా బావుంది అని అన్నారు. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. సివి ఆనంద్ గారు ఈ పాట విడుదల చేయడం మా సినిమాకు గర్వకారణం. నటనకు మంచి అవకాశం ఉన్న పాత్రని ఈ సినిమాలో పోషించాను అని తెలిపారు.

Also Read : Thalapathy Vijay : విజయ్ లాస్ట్ మూవీ టైటిల్ ఏంటో తెలుసా? ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అదుర్స్‌..

నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ.. కానిస్టేబుల్ అవ్వాలని నా చిన్నప్పటి కల. అది అవ్వకపోవడంతో ఆ టైటిల్ తో సినిమాను నిర్మితిషున్నాను. కానిస్టేబుల్స్ మీద నాకున్న గౌరవంతో ఈ పాటను నేను దగ్గరుండి రాయించి నల్గొండ గద్దర్ నరసన్నతో పాడించాను అని తెలిపారు. డైరెక్టర్ ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ.. సినిమాలో ఈ సాంగ్ సందర్భానుసారంగా వచ్చి ఎంతగానో ఆలోచింపజేస్తుంది అని తెలిపారు.

Varun Sandesh Constable Movie Title Song Released Sing by Nalgonda Gaddar Narsanna