Varun Sandesh : వరుణ్ సందేశ్ ‘చిత్రం చూడరా’.. ఈ సినిమాతో అయినా కమ్‌బ్యాక్ ఇస్తాడా?

హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హీరో వరుణ్ సందేశ్. అయితే గత కొంత కాలంగా ఒక్క హిట్టు లేక ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా తన కొత్త సినిమాని తీసుకు వస్తున్నాడు వరుణ్. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

Varun Sandesh : వరుణ్ సందేశ్ ‘చిత్రం చూడరా’.. ఈ సినిమాతో అయినా కమ్‌బ్యాక్ ఇస్తాడా?

Varun Sandesh new movie title and first look poster released

Updated On : March 9, 2023 / 1:10 PM IST

Varun Sandesh : హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హీరో వరుణ్ సందేశ్. ఆ మూవీ తరువాత ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో కూడా మంచి విజయం అందుకున్నాడు. ఈ రెండు సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు వరుణ్ సందేశ్. దీంతో టాలీవుడ్ లో యూత్ ఫుల్ సబ్జెట్స్ కి మొదటి ఛాయస్ వరుణ్ అయ్యిపోయాడు. ఈ క్రమంలోనే కుర్రాడు, మరో చరిత్ర, ఏమైంది ఈవేళ వంటి సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.

Varun sandesh : శివమాలతో మురుడేశ్వర్‌లో హీరో వరుణ్ సందేశ్..

అయితే గత కొంత కాలంగా ఒక్క హిట్టు లేక ఇబ్బంది పడుతున్నాడు. చివరిగా ‘ఇందువదన’ వంటి హారర్ కామెడీతో ఆడియన్స్ ముందుకు వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇటీవల సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘మైఖేల్’ సినిమాలో మొదటిసారి విలన్ రోల్ లో కనిపించాడు. ఆ సినిమా కూడా విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ హీరోగా తన కొత్త సినిమాని తీసుకు వస్తున్నాడు వరుణ్.

ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ‘చిత్రం చూడరా’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. పోస్టర్ చూస్తుంటే క్రైమ్ కామెడీ బ్యాక్‌డ్రాప్ లో సినిమా ఉండబోతుందని అర్ధమవుతుంది. వరుణ్ సందేశ్ పాటు కామెడియన్ ధన్‌రాజ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాశీవిశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. కొత్త అమ్మాయి తుమ్మల ధన ఫిమేల్ లీడ్ చేయబోతున్నట్లు సమాచారం. హర్షవర్ధన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా రాధన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శేషు మరంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మి సంయుక్తం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో అయినా వరుణ్ సందేశ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా? లేదా? చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Varun Sandesh (@itsvarunsandesh)