Induvadana Review:వరుణ్ సందేశ్ నటించిన ఇందువదన రివ్యూ!
వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ప్రధాన పాత్రలుగా ఎం శ్రీనివాస రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఇందువదన’.

Varun Sandesh
Induvadana Review: వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ప్రధాన పాత్రలుగా ఎం శ్రీనివాస రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఇందువదన’. ఈ సినిమా లేటెస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘హ్యపీడేస్’, ‘కొత్త బంగారులోకం’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వరుణ్ సందేశ్ పెద్ద హిట్ అయితే అందుకోలేదు.. ఈ క్రమంలోనే క్రేజ్ కాస్త తగ్గినప్పటికీ, బిగ్‌బాస్‌లో వచ్చిన విపరీతమైన క్రేజ్ తర్వాత విడుదలైన సినిమా కావడంతో సినిమాపై అంచనాలు ఉన్నాయి.
కథ విషయానికి వస్తే..
వాసు ( వరుణ్ సందేశ్) ఫారెస్ట్ ఆఫీసర్. తన టీమ్‌తో కలిసి అడవిలో స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు సిన్సియర్‌గా పనిచేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అడవిలో గిరిజన యువతి (ఫర్నాజ్ శెట్టి)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే కులం వారి ప్రేమకు ఆటంకంగా మారగా.. అనుహ్యా పరిణామాల మధ్య ఇందు హత్యకు గురవుతుంది. అసలు ఇందుని హత్య చేసిందెవరు? ఇందు చనిపోయిన తర్వాత వాసు పరిస్థితి ఏంటీ? ఏం చేశాడు అనేదే మిగిలిన కథ.
నటన విషయానికి వస్తే..
ఫారెస్ట్ ఆఫీసర్ వాసు పాత్రలో తెరపై సరికొత్తగా కనిపించడంతో పాటు నటనాపరంగానూ వరుణ్ సందేశ్ మెప్పించాడు. పలు రకాల వేరియేషన్స్ ఉన్న పాత్రలో కొత్తగా కనిపిస్తాడు వరుణ్ సందేశ్. అడవిలో గిరిజన యువతి ఇందు పాత్రలో ఫర్నాజ్ శెట్టి బాగా చేసింది. ఆలీ, మహేష్ విట్టా, పార్వతీశం, ధన్ రాజ్, తాగుబోతు రమేష్ కామెడీ బాగా చేశారు. నాగినీడు పాత్ర కథను మలుపు తప్పడం పాజిటివ్ అంశం. వరుణ్ సందేశ్‌కు తల్లిగా సురేఖ వాణి నటించింది.
విశ్లేషణ:
దర్శకుడు శ్రీనివాస రాజు ఎంచుకొన్న పాయింట్ రెగ్యులరే అయినా.. కథనం ఆకట్టుకుంటుంది. ఇందుపై దాడి, ఫారెస్ట్‌లో మాఫియా ఎటాక్ లాంటి అంశాలతో కథ ఎమోషనల్‌గా మొదలవుతుంది. ఆ తర్వాత వాసు, ఇందు ప్రేమ సన్నివేశాలు సినిమాకు ఫీల్‌గుడ్ అంశాలుగా కనిపిస్తాయి. హారర్, థ్రిల్లర్, రొమాంటిక్, లవ్ అంశాలు కలబోసి రూపొందించాడు దర్శకుడు.
పాత్రలను రాసుకొన్న విధానం, తెరకెక్కించిన తీరు కొత్తగా అనిపిస్తుంది. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఆంధ్ర ప్రాంతాలను కవర్ చేస్తూ కమెడియన్లతో పాత్రలు రాసుకొన్న తీరు.. తెరకెక్కించిన విధానం బాగుంది. కానీ, కథపై ఇంకొంచెం పట్టు పెట్టి ఉంటే బాగుండేది. శివ కాకాని మ్యూజిక్ బాగుంది. కీలక సన్నివేశాను రీరికార్డింగ్ బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రాఫర్ బీ మురళీకృష్ణ ఆకట్టుకున్నారు.