వస్తున్నా వచ్చేస్తున్నా.. ‘వి’ సర్‌ప్రైజింగ్ వీడియో..

Vasthunna Vachestunna Video Song: నేచురల్ స్టార్ నాని 25వ చిత్రం ‘వి’ నుంచి సుధీర్ బాబు, నివేదా థామస్ పాత్రల మధ్య ప్రేమని తెలిపే ఒక సూథింగ్ మెలోడీ సాంగ్‌ని అమెజాన్ ప్రైమ్ వీడియో శుక్రవారం ఆవిష్కరించింది. ‘వస్తున్నా వచ్చేస్తున్నా..’ అంటూ సాగే ఈ పాటను శ్రేయా ఘోషల్ ఆలపించగా అమిత్ త్రివేది స్వరపరిచారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాట రెండు లవ్‌బర్డ్‌ల మధ్య శృంగారాన్ని వివరిస్తూ మనోహరంగా ఉంది. ఈ పాట అందరి హృదయ స్పందనలను హత్తుకుంటూ, ప్రేమలో ఉన్న వెచ్చని మరియు గజిబిజి అనుభూతిని తెలియజేస్తుందని చిత్రయూనిట్ ప్రకటించింది.
మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘నేచురల్ స్టార్’ నాని, సుధీర్ బాబు ముఖ్య పాత్రల్లో నటించారు, నివేదా థామస్ మరియు అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని భారతదేశంతో 200 దేశాలు మరియు టెర్రిటోరియాస్‌లో ఉన్న ప్రైమ్ సభ్యులు సెప్టెంబర్ 5న డిజిటల్ ప్రీమియర్‌ను వీక్షించవచ్చని చిత్రయూనిట్ అధికారికంగా తెలియజేసింది.