Veera Simha Reddy : తన ‘సుగుణ సుందరి’ని అప్పుడే పరిచయం చేస్తానంటున్న బాలయ్య..

బాలకృష్ణ 107వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా 'వీరసింహారెడ్డి'. ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా వరుస అప్డేట్ లు ఇస్తూ సందడి చేస్తుంది. తాజాగా...

Veera Simha Reddy : తన ‘సుగుణ సుందరి’ని అప్పుడే పరిచయం చేస్తానంటున్న బాలయ్య..

Veera Simha Reddy second single release date out

Updated On : December 11, 2022 / 6:43 PM IST

Veera Simha Reddy : బాలకృష్ణ 107వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా ‘వీరసింహారెడ్డి’. ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా అనౌన్స్‌మెంట్ తోనే మంచి బజ్ ని క్రియేట్ చేసుకోగా, విడుదలైన పోస్టర్ అండ్ ప్రచార చిత్రాలు మూవీపై మరెంత అంచనాలు పెరిగేలా చేశాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా వరుస అప్డేట్ లు ఇస్తూ సందడి చేస్తుంది.

Balayya : బాలకృష్ణతో పాన్ వరల్డ్ సినిమాని నిర్మించబోతున్నాం..

తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ సింగల్ ని విడుదల చేయడానికి డేట్ ని ఖరారు చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ అమ్మడికి సంబంధించి ఎటువంటి ఫస్ట్ లుక్ పోస్టర్ గాని అప్డేట్ గాని ఇవ్వలేదు. కాగా నేడు ఈ సినిమాలో ‘సుగుణ సుందరి’ అంటూ సాగే పాటని విడుదల చేసే డేట్ ని ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్.

ఈ పోస్టర్ లో శృతిహాసన్, బాలయ్య బ్లాక్ డ్రెస్ లో ఉండగా, సాంగ్ లో స్టెప్ స్టిల్ ని కలిగి ఉంది. ఇప్పటికే విడుదలైన మొదటి పాట ‘జై బాలయ్య’ సూపర్ హిట్టు కావడంతో, ‘సుగుణ సుందరి’ పాటపై కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్, దునియా విజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

Veera Simha Reddy second single release date out

Veera Simha Reddy second single release date out