కన్ఫ్యూజ్ చేస్తున్న ‘వెంకీమామ’ టైటిల్ లోగో
‘ఎఫ్ 2’ తో ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన విక్టరీ వెంకటేష్.. తాజాగా ‘వెంకీమామ’ షూటింగ్‌తో బిజీ అయ్యారు.

‘ఎఫ్ 2’ తో ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన విక్టరీ వెంకటేష్.. తాజాగా ‘వెంకీమామ’ షూటింగ్‌తో బిజీ అయ్యారు.
‘ఎఫ్ 2’ తో ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన విక్టరీ వెంకటేష్.. తాజాగా ‘వెంకీమామ’ షూటింగ్‌తో బిజీ అయ్యారు. నాగ చైతన్య, వెంకటేష్ కలిసి నటిస్తుండటంతో.. ఈ సినిమా పై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. చాలా రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్, చైతూ సరసన రాశి ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Read Also : మజిలి రివ్యూ
ఉగాది సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగోను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. రాశీ చక్రంలో వెంకీమామ టైటిల్‌ను ఆసక్తికరంగా డిజైన్‌చేశారు. ‘వెంకీ’ అనేది ఆంగ్ల అక్షరాలతో .. ‘మామ’ అనేది తెలుగు అక్షరాల్లో డిజైన్ చేశారు. పోస్టర్లో ఒక వైపున పల్లెటూరు.. మరో వైపున యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇందులో వెంకటేశ్, నాగచైతన్య నిజజీవితంలో మాదిరిగానే మామా అల్లుళ్లుగా నటించనున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన పాయల్ రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు.
అంతేకాదు యంగ్ డైరక్టర్ బాబీ ఈ సినిమాను పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి తమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటారు. ఆగస్టు నాటికి ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసి, దసరా పండుగకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
Read Also : బాధలు పోతాయి : ఈ శ్లోకం చదువుతూ ఉగాది పచ్చడి తినాలి