Saindhav : ప్రభాస్ రాకతో సంక్రాంతికి వెళ్లే ఆలోచనలో వెంకటేష్.. సైంధవ్ పోస్ట్‌పోన్..!
ప్రభాస్ సలార్ క్రిస్టమస్ కి వస్తుండడంతో వెంకటేష్ సైంధవ్ పోస్ట్‌పోన్..

Venkatesh Saindhav postpone due to Prabhas Salaar
Saindhav – Salaar : రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఒక్క సినిమాతో టాలీవుడ్ మూవీస్ రిలీజ్స్ లో అనేక చేంజ్స్ జరుగుతూ వస్తున్నాయి. సెప్టెంబర్ 28న రిలీజ్ అవ్వాల్సిన సలార్ (Salaar) పోస్ట్‌పోన్ అవ్వడంతో ఆ డేట్ అనేక సినిమాలు వచ్చి చేరాయి. అయితే ఈ విషయం ఆ సినిమాలకు కలిసొచ్చినా.. సలార్ కొత్త రిలీజ్ డేట్ వేరే సినిమాలకు తలనొప్పి తెచ్చిపెడుతుంది. తాజాగా సలార్ క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 22న రిబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది. నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఆ డేట్ ఫిక్స్ అని సమాచారం.
Nithya Menen : తమిళ్ యాక్టర్ నన్ను వేధించాడు.. వైరల్ అవుతున్న నిత్యా మీనన్ కామెంట్స్.. నిజమెంత..?
అయితే ఆ సమయంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) నటిస్తున్న ‘సైంధవ్’ కూడా రిలీజ్ ఉంది. ఇప్పుడు ఆ డేట్ కి సలార్ వస్తే.. సైంధవ్ కి ఇబ్బంది అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. దీంతో పోస్ట్‌పోన్ వేసే ఆలోచనలో మూవీ టీం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ప్రొడక్షన్ ఆఫీసులో ఇందుకు సంబంధించిన డిస్కషన్లు కూడా మొదలైనట్లు సమాచారం. వాయిదా వేసుకొని సంక్రాంతికి రావాలనే ఆలోచన చేస్తున్నారట. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు గాని.. వెంకీ మామ అభిమానులు ఈ న్యూస్ నిరాశకు గురి చేస్తుంది.
Sai Dharam Tej – Swathi : కాలేజీ టైంలో స్వాతి పేపర్ కాపీ కొట్టి పాస్ అయిన సాయి ధరమ్ తేజ్..
శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఈ మూవీతో వెంకటేష్ కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, తమిళ నటుడు ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా.. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. వెంకటేష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది.