Vijay Antony : కూతురి మరణంపై విజయ్ ఆంటోనీ భార్య ఎమోషనల్ ట్వీట్.. నువ్వు 16 ఏళ్లు మాత్రమే జీవిస్తావని..

విజయ్ ఆంటోనీ సతీమణి 'ఫాతిమా' కూతురి మరణం పై రియాక్ట్ అవుతూ ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు.

Vijay Antony : కూతురి మరణంపై విజయ్ ఆంటోనీ భార్య ఎమోషనల్ ట్వీట్.. నువ్వు 16 ఏళ్లు మాత్రమే జీవిస్తావని..

Vijay Antony Wife Fatima post on her daughter demise

Updated On : October 9, 2023 / 8:52 PM IST

Vijay Antony Wife Fatima : తమిళ హీరో విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సంఘటనతో విజయ్ ఆంటోనీ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లారు. ఇక కూతురి మరణం గురించి విజయ్ స్పందిస్తూ ఒక ఎమోషనల్ లెటర్ ని కూడా రిలీజ్ చేశాడు. తాజాగా ఆయన సతీమణి ‘ఫాతిమా’ కూడా రియాక్ట్ అవుతూ ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు.

Also read : Sarvam Shakthi Mayam : అష్ఠాదశ పీఠాలపై ఆహా సరికొత్త వెబ్ సిరీస్.. ‘సర్వం శక్తిమయం’ రిలీజ్ డేట్..

“నువ్వు 16 ఏళ్లు మాత్రమే జీవిస్తావని ముందుగానే నాకు తెలిసుంటే.. నిన్ను ఆ సూర్యచంద్రులకు కూడా చూపించకుండా నాకు మరింత దగ్గరగా పెట్టుకునే దానిని. నీ ఆలోచనలతో నేను నరకం అనుభవిస్తున్నాను. నువ్వు లేకుండా బ్రతకలేకపోతున్నాను. అమ్మానాన్న దగ్గరకి తిరిగి వచ్చే మీరా. చెల్లి కూడా నీకోసం ఎదురు చూస్తుంది” అంటూ ట్వీట్ చేశారు. ఇక ట్వీట్ చూసిన విజయ్ ఆంటోనీ అభిమానులు.. ఆమెకు ధైర్యం చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

కాగా పెద్ద కూతురి మరణం తరువాత విజయ్.. తన చిన్న కూతురిని తన వెంటే పెట్టుకుంటున్నాడు. ఈక్రమంలోనే ఇటీవల ఒక సినిమా ప్రమోషన్స్ కూడా తీసుకు వచ్చాడు. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ ‘హిట్లర్’ అనే ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇటీవల ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ ని విజయ్ రిలీజ్ చేశాడు. పొలిటికల్ నేపథ్యంతో ఈ మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు మేకర్స్ తెలియజేశారు.