Vijay Deverakonda : విజయ్ దేవరకొండ నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా అనౌన్స్.. డైరెక్టర్ ఎవరంటే?

తాజాగా విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమాని ప్రకటించారు.

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా అనౌన్స్.. డైరెక్టర్ ఎవరంటే?

Vijay Devarakonda Next Movie Announced under Dil Raju Production

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది. ఓటీటీలో కూడా దూసుకుపోతుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై పీరియాడిక్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉందని సమాచారం.

తాజాగా విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమాని ప్రకటించారు. దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా ఉండనుంది. రాజావారు రాణిగారు సినిమా దర్శకుడు రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమా గురించి చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండనుందని తెలిపారు.

Also Read : B S Sarwagna Kumar : కల్కి సినిమాకి ఈ డైరెక్టర్ పనిచేశాడని తెలుసా? ఎవరంటే?

మే 9న విజయ్ దేవరకొండ పుట్టిన రోజున ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నట్టు తెలిపారు చిత్రయూనిట్. దిల్ రాజు, విజయ్ దేవరకొండ, రవి కిరణ్ కోలా కలిసి దిగిన ఫోటో షేర్ చేసి ఈ విషయాన్ని ప్రకటించారు. ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో 59వ సినిమా. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుందని సమాచారం. గతంలో ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో దిల్ రాజు విజయ్ దేవరకొండతో భారీ పాన్ ఇండియా సినిమా తీస్తాం అని తెలిపిన సంగతి తెలిసిందే. ఇదే ఆ సినిమా అని తెలుస్తుంది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.