అభిమానులకు విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్: క్రిస్మస్‌కు ఏం చేశాడంటే?

  • Published By: vamsi ,Published On : December 25, 2019 / 07:14 AM IST
అభిమానులకు విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్: క్రిస్మస్‌కు ఏం చేశాడంటే?

Updated On : December 25, 2019 / 7:14 AM IST

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఏదీ చేసిన పక్కా ప్లాన్ ప్రకారం చేస్తుంటాడు. ఆయన సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో అభిమానులను అలరించేందుకు ప్లాన్స్ చేసుకుంటూ ఉంటాడు. అభిమానులను కలిసేందుకు సోషల్ మీడియాలోనే ప్లాన్ చేస్తారు విజయ్. ఏదైనా పండుగ వచ్చినా.. పుట్టినరోజులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేందుకు ముందుంటాడు విజయ్.

ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా క్రిస్మస్ కానుకగా విజయ్ దేవరకొండ తన అభిమానులకు ఓ అనుకోని సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ప్లాన్ చేశారు. ప్రతి ఏటా తన అభిమానులకు ఏదో రకంగా గిఫ్టులు ఇచ్చే విజయ్.. ఈ సారి కూడా సెంటిమెంట్‌ ఫాలో అయ్యాడు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులను ఏదైనా కోరుకోమని, వీలైనంత వరకు వారి కోరికలు తీర్చేందుకు ప్రయత్నిస్తాడని చెప్పుకొచ్చాడు.

ఈ మేరకు ఓ వీడియోని కూడా అభిమానులతో పంచుకున్నాడు. అతడికి అందిన కోరికల్లో కొన్నింటిని నిజం చేస్తూ గిఫ్టులు రెడీ చేస్తున్న వీడియోను విజయ్ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. తన అభిమానులను సంతోష పెట్టడమే తనకు పెద్ద సంతోషం అని చెప్పిన విజయ్.. అభిమానులకు ఎటువంటి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు పంపిస్తాడో వేచి చూడాలి.