తెలుగు రాష్ట్రాల్లో ‘విజిల్’ వేస్తున్న విజయ్

దళపతి విజయ్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా.. ‘బిగిల్’.. తెలుగులో ‘విజిల్’ పేరుతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతుంది..

  • Published By: sekhar ,Published On : October 30, 2019 / 10:52 AM IST
తెలుగు రాష్ట్రాల్లో ‘విజిల్’ వేస్తున్న విజయ్

Updated On : October 30, 2019 / 10:52 AM IST

దళపతి విజయ్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా.. ‘బిగిల్’.. తెలుగులో ‘విజిల్’ పేరుతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతుంది..

దళపతి విజయ్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా.. ‘బిగిల్’.. తెలుగులో ‘విజిల్’ పేరుతో ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో, స్పోర్ట్స్ అండ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ‘బిగిల్’లో విజయ్.. రాజప్ప, మైఖేల్‌గా ద్విపాత్రాభినయం చేశాడు. నయనతార హీరోయిన్‌గా నటించింది. ‘విజిల్’ ను 1‘18’ నిర్మాత మహేష్ కోనేరు ‘బిగిల్’ నిర్మాతలతో కలిసి తెలుగులో రిలీజ్ చేయగా.. దిల్ రాజు నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేశాడు.

మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ.. భారీ కలెక్షన్లు రాబడుతుందీ చిత్రం.. మొదటి రోజు నుంచి మంచి వసూళ్ళని సాధిస్తూ.. తెలుగులో  విజయ్ కెరీర్‌లో నంబర్ 1 మూవీగా నిలిచింది. 5వ రోజు మిగిలిన 4 రోజుల మీద బాగా డ్రాప్ అయినప్పటికీ డబ్బింగ్ సినిమాకి ఇవి డీసెంట్ నెంబర్స్ అనే చెప్పాలి. మొదటి ఐదు రోజుల్లోనే దాదాపు 80% రికవరీ చేయడం విశేషం.. 5వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 66 లక్షల దాకా షేర్ రాబట్టింది. ఏరియాల వారీగా ‘విజిల్’ ఐదు రోజుల కలెక్షన్స్ వివరాలు..

Read Also : ‘గులాబో సితాబో’ : ఆయుష్మాన్ లుక్ – రెండు నెలలముందే రిలీజ్..

నైజాం : రూ. 2.66 కోట్లు
సీడెడ్ :  రూ. 2.36 కోట్లు
గుంటూరు : రూ. 85.2 లక్షలు
ఉత్తరాంధ్ర : రూ. 83.3 లక్షలు

తూర్పు గోదావరి : రూ. 56.1 లక్షలు
పశ్చిమ గోదావరి : రూ. 38.7లక్షలు
కృష్ణా : రూ. 54.3 లక్షలు
నెల్లూరు : రూ. 35.8 లక్షలు
ఆంధ్ర, తెలంగాణ టోటల్ షేర్ : రూ. 8.55 కోట్లు.