హమిద్ మహ్మద్ ఖాన్ గారూ స్పందించండి.. రాములమ్మ విన్నపం..
తబ్లిగ్ జమాత్ కార్యక్రమంపై స్పందించిన విజయశాంతి..

తబ్లిగ్ జమాత్ కార్యక్రమంపై స్పందించిన విజయశాంతి..
ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ బిల్డింగ్ జరిగిన తబ్లిగ్ జమాత్ కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. నిజాముద్దీన్ మర్కజ్ తబ్లీగి జమాత్ కు హాజరైనవారిలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న 25మంది ఢిల్లీ కరోనా పాజిటివ్ రాగా, 617 మందికి కరోనా లక్షణాలు ఇప్పటివరకు బయటపడ్డాయి. తాజాగా ఈ ఘటనపై సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
‘‘జమాతే ఇస్లామీ అధ్యక్షులు హమిద్ మహ్మద్ ఖాన్ గారూ.. మేము ఎవరుబడితే వారిని పిలవం… కేవలం ఎంపిక చెయ్యబడిన ప్రతినిధులను మాత్రమే అనుమతిస్తామని అన్నారు. ఆ వ్యక్తుల వివరాలు, ఫోన్ నెంబర్లు ఎందుకు ఇవ్వడం లేదు? ఇచ్చి ముస్లిం సమాజాన్ని ఆరోపణల నుంచి కాపాడే ప్రయత్నం ఎందుకు చెయ్యడం లేదు?
అయినప్పటికీ, సమాజ శ్రేయస్సు దృష్ట్యా వారందరికీ పిలుపు ఇచ్చినందుకు మహ్మద్ ఖాన్ గారికి కృతజ్ఞతలు. ఇప్పటికైనా ప్రయాణీకులు వివరాలిచ్చి తమను, తమ కుటుంబాలను, సమాజాన్నికాపాడాలి. కుట్ర కోణమనే ఆరోపణలు నిజం కాదని నిరూపించుకోవాలి.
ఇది భవిష్యత్‌లో అమాయకులను ఇబ్బందులకు గురి చెయ్యకుండా ఉంటుంది. టెర్రరిజం మతానికి సంబంధించినది కాదు. ఇస్లామిక్ టెర్రరిజం అని రాయకూడదని కొట్లాడిన వ్యక్తిగా పైన నేను వ్యక్తం చేసిన ఈ అభిప్రాయం కూడా అందరికీ అర్థమవుతుందని విశ్వసిస్తున్నాను’’.. అంటూ రాములమ్మ ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
కరోనా లక్షణాలు ఉన్నవారిని ఢిల్లీలోని ఐదు ఆసులత్రులకు తరలించారు. మర్కజ్ భవనం నుంచి 2361 మందిని తరలించారు. 17 వందల మందిని స్వీయ నిర్భందానికి తరలించిన సంగతి తెలిసిందే.
జమాతే ఇస్లామీ అధ్యక్షులు హమిద్ మహ్మద్ ఖాన్ గారూ,
మేము ఎవరుబడితే వారిని పిలవం… కేవలం ఎంపిక చెయ్యబడిన ప్రతినిధులను మాత్రమే అనుమతిస్తామని అన్నారు. ఆ వ్యక్తుల వివరాలు, ఫోన్ నెంబర్లు ఎందుకు ఇవ్వడం లేదు? ఇచ్చి ముస్లిం సమాజాన్ని ఆరోపణల నుంచి కాపాడే ప్రయత్నం ఎందుకు చెయ్యడం లేదు?
— VijayashanthiOfficial (@vijayashanthi_m) April 1, 2020