Viraj Ashwin : గిన్నిస్ రికార్డ్ షార్ట్‌ఫిలిం హీరో.. ఇప్పుడు ‘బేబీ’తో.. దూసుకుపోతున్న విరాజ్ అశ్విన్..

‘బేబీ’ సినిమా జులై 14న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాతో హీరో విరాజ్ అశ్విన్ మరో స్థాయికి వెళ్లనున్నాడు.

Viraj Ashwin : గిన్నిస్ రికార్డ్ షార్ట్‌ఫిలిం హీరో.. ఇప్పుడు ‘బేబీ’తో.. దూసుకుపోతున్న విరాజ్ అశ్విన్..

Viraj Ashwin coming with Baby movie on this July 14th it will become his career turning point

Viraj Ashwin :  విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజయిన సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి. పాటలు, ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ‘బేబీ’ సినిమా జులై 14న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాతో హీరో విరాజ్ అశ్విన్ మరో స్థాయికి వెళ్లనున్నాడు.

అనగనగా ఓ ప్రేమ కథతో అరంగేట్రం చేశాడు యంగ్ హీరో విరాజ్ అశ్విన్. తొలి సినిమాతోనే తన నటనతో మెప్పించిన విరాజ్‌ ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు VN ఆదిత్య దర్శకత్వంలో ‘వాళ్ళిద్దరి మధ్య’ అనే సినిమా చేశాడు. అనంతరం ‘థ్యాంక్యూ బ్రదర్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు ఏర్పడింది. నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలతోనే కాక విరాజ్ అశ్విన్ తన షార్ట్ ఫిల్మ్ “మనసానమహ”తో ఓ సెన్సెషన్ క్రియేట్ చేశాడు. ఈ షార్ట్ ఫిల్మ్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అవార్డులు పొందిన షార్ట్ ఫిల్మ్ (513 అవార్డులు)గా గిన్నిస్ రికార్డ్ సాధించింది.

సినీ పరిశ్రమలో ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ విరాజ్ అశ్విన్ కు సొంత మేనమామ అవుతారు. ఇటీవలే పాయల్ రాజ్‌పుత్ తో కలిసి మాయాపేటిక అనే సినిమాతో కూడా మెప్పించాడు విరాజ్. ఇలా వరుస సినిమాలతో ఫామ్ లో ఉన్న విరాజ్ అశ్విన్ ఇప్పుడు బేబీ సినిమాతో రాబోతున్నాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలతో కలిసి బేబీ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు విరాజ్. ఇప్పటికే రిలీజయిన ట్రైలర్ చూస్తుంటే లవర్ బాయ్ తరహా పాత్రలో మెప్పించాడని అర్ధమవుతుంది. స్క్రీన్ ప్రజెన్స్ కూడా అదిరిపోయింది. పాటల్లోనూ అద్భుతంగా నటించాడు. ట్రైలర్ లాంచ్‌లో “చాక్లెట్ బాయ్ లుక్స్” అని విరాజ్ అశ్విన్‌ను చిత్ర నిర్మాత ఎస్‌కేఎన్ ప్రశంసించారు.

Upendra : ఉపేంద్ర సరికొత్త బిజినెస్.. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లకు రెంట్‌కి తన ఫామ్‌హౌస్..

ఈ సంవత్సరం ఇప్పటికే విరాజ్ అశ్విన్ నుంచి మాయాపేటిక సినిమా రాగా ఇప్పుడు బేబీ సినిమా జులై 14న రాబోతుంది. ఈ సినిమా తర్వాత మరో మూడు ప్రాజెక్ట్స్ విరాజ్ అశ్విన్ చేతిలో ఉన్నాయి. బేబీ సినిమా వైబ్స్ చూస్తుంటే సినిమా పెద్ద హిట్ అయ్యేలా ఉంది. ఈ సినిమా తర్వాత విరాజ్ అశ్విన్ కి మరిన్ని ఆఫర్స్ కచ్చితంగా వస్తాయి అని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.