బీచ్ లో రెచ్చిపోయిన శ్రియ

  • Published By: venkaiahnaidu ,Published On : September 4, 2019 / 03:06 PM IST
బీచ్ లో రెచ్చిపోయిన శ్రియ

Updated On : September 4, 2019 / 3:06 PM IST

ఓ దశలో టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా శ్రియా శరణ్ వెలుగొందింది. కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు ఈ అమ్మడు దూరంగా ఉంటోంది. చివరగా బాలకృష్ణ సరసన పైసా వసూల్ లో కనిపించింది. ప్రస్తుతం కోలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ భామ తన భర్త ఆండ్రీతో కలిసి స్పెయిన్ లోని ఐబిజా బీచ్ కు వెళ్లింది.

బీచ్ లో శ్రియా సరదాగా డ్యాన్స్ చేసింది. బీచ్ లో డ్యాన్స్ చేసిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. శ్రియ డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అయ్యారు. భర్త ఆండ్రీతో కలిసి దిగిన ఫొటోలను కూడా షేర్ చేసింది. శ్రియా డ్యాన్స్ వీడియో, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Once upon a time in Ibiza. Will miss island ? life …. till next time. @andreikoscheev

A post shared by @ shriya_saran1109 on