Gangs Of Godavari : అదరకొట్టిన విశ్వక్ సేన్.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించారు మూవీ యూనిట్.

Vishwak Sen Gangs Of Godavari First Day Collections Details Here
Gangs Of Godavari : విశ్వక్ సేన్ హీరోగా నేహశెట్టి (Neha Shetty), అంజలి (Anjali) ఫిమేల్ లీడ్స్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా నిన్న మే 31న రిలీజయింది. ఈ సినిమాకు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వస్తుంది. విశ్వక్ మాస్ పర్ఫార్మెన్స్ కి అందరూ ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్లు కూల్ గా చూపించిన గోదావరిని మాస్ యాక్షన్స్ తో కొత్తగా చూపించారు. ఇటీవల దాస్ కా ధమ్కీ, గామి.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన విశ్వక్ ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మరోసారి హిట్ అందుకున్నాడు.
Also Read : Manamey Trailer : శర్వానంద్ ‘మనమే’ ట్రైలర్ వచ్చేసింది.. పిల్లల్ని పెంచడం అంటే ఈజీ కాదు..
ముందు నుంచి ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించారు మూవీ యూనిట్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మొదటి రోజు 8.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు ప్రకటించారు. ఇటీవల సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూసేయడంతో డల్ అయిన సినీ పరిశ్రమకు ఓపెన్ చేసిన తర్వాత ఓ సినిమాకు ఇంత కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారి. అది కూడా సింగిల్ స్క్రీన్స్ నుంచే ఎక్కువ కలెక్షన్స్ రావడం గమనార్హం.
ఇక నేడు, రేపు వీకెండ్ కాబట్టి ఈ రెండు రోజుల్లో 20 కోట్లు ఈజీగా దాటేస్తుందని అంచనాలు వేస్తున్నారు. మరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మొత్తంగా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
#GangsofGodavari smashes ?.? ????? worldwide gross on opening day! ??
Going Houseful everywhere, grab your tickets now! ?
Don’t miss ???? ?? ??? ??????? at theatres near you! ?? @VishwakSenActor @thisisysr… pic.twitter.com/no1xSmzpYs
— L.VENUGOPAL? (@venupro) June 1, 2024