VJ Sunny: డబ్బులు దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిన విజే సన్నీ
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్‌గా నిలిచిన వీజే సన్నీ ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపును తనవైపుకు తిప్పుకున్నాడు. ఇక ఆ తరువాత పలు షోలు, సినిమా ఛాన్స్‌లు అందుకుంటూ వస్తున్నాడు వీజే సన్నీ. అయితే ఆయన తాజాగా ‘ఏటీఎం’ అనే వెబ్ సిరీస్‌లో నటించగా, ప్రస్తుతం అది రిలీజ్‌కు రెడీ అయ్యింది. కాగా, అందరికీ షాకిస్తూ ఈ హీరో పట్టపగలే డబ్బులు దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు.

VJ Sunny Robbery Caught On CCTV
VJ Sunny: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్‌గా నిలిచిన వీజే సన్నీ ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపును తనవైపుకు తిప్పుకున్నాడు. ఇక ఆ తరువాత పలు షోలు, సినిమా ఛాన్స్‌లు అందుకుంటూ వస్తున్నాడు వీజే సన్నీ. అయితే ఆయన తాజాగా ‘ఏటీఎం’ అనే వెబ్ సిరీస్‌లో నటించగా, ప్రస్తుతం అది రిలీజ్‌కు రెడీ అయ్యింది. కాగా, అందరికీ షాకిస్తూ ఈ హీరో పట్టపగలే డబ్బులు దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు.
VJ Sunny : బిగ్‌బాస్ నాకేమి ఉపయోగపడలేదు.. మాజీ బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ
అవును.. వీజే సన్నీ ఓ డబ్బుల బ్యాగ్‌ను ఎత్తుకెళ్తుండగా, సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఇది చూసిన అతడి అభిమానులు, నెటిజెన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తన కారులో నుంచి దిగి ఓ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లిన సన్నీ.. చేతిలో ఓ బ్యాగ్ పట్టుకుని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. అయితే మధ్యలో ఆ బ్యాగులో నుంచి డబ్బు నోట్లు కింద పడిపోయాయి. దీంతో హడావిడిగా ఆ నోట్లను తిరిగి బ్యాగులో సర్దేసుకుని తన కారు ఎక్కి అక్కడి నుండి వెళ్లిపోయాడు.
VJ Sunny : షూటింగ్ స్పాట్ లో బిగ్‌బాస్ సన్నీపై దాడి.. పోలీసులకి ఫిర్యాదు..
ఇదంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కావడంతో ఇది నిజమా లేక ఏదైనా ప్రాంక్ చేశారా అనే అయోమయంలో అభిమానులు పడిపోయారు. అయితే ఇదంతా కేవలం ప్రమోషన్స్ కోసమే వీజే సన్నీ చేసినట్లుగా తెలుస్తోంది. ఏటీఎం అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్న వీజే సన్నీ ఇలా దొంగతనం చేస్తూ కనిపించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఇక ఈ వెబ్ సిరీస్‌కు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కథను అందించడం విశేషం.