VN Aditya : అమెరికాలో తెలుగు సాంగ్స్.. స్పెషల్ సాంగ్ ని డైరెక్ట్ చేస్తున్న దర్శకుడు..
ఒకప్పటి స్టార్ డైరెక్టర్ VN ఆదిత్య ఈ సాంగ్ ని డైరెక్ట్ చేశారు.

VN Aditya Direct a Private Telugu Song in America while Remembering Sirivennela Seetharamasastry
VN Aditya : ఇటీవల అమెరికాలో తెలుగు వాళ్ళ హవా, తెలుగు సినిమాల హవా ఎక్కువైనా సంగతి తెలిసిందే. డల్లాస్‌లో సెటిల్ అయిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గోపీ కృష్ణ కొటారు శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్‌మెంట్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తన కుమార్తె శ్రీజ కొటారు పాడి నటించిన స్వప్నాల నావ అనే వీడియో సాంగ్ ని మొదట రిలీజ్ చేయబోతున్నారు.
దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి దివ్య స్మృతికి అంకితంగా ఈ పాటని ఓఎమ్జీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినీ నిర్మాత మీనాక్షి అనిపిండి సమర్పకురాలిగా నిర్మిస్తున్నారు. ఈ పాటకు పార్ధసారధి నేమాని సంగీతం అందించగా యశ్వంత్ ఈ పాటను రాసారు. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ VN ఆదిత్య ఈ సాంగ్ ని డైరెక్ట్ చేశారు. ఈ సాంగ్ ని పూర్తిగా అమెరికాలోని డల్లాస్ లోనే షూట్ చేశారు.
Also See : Ram Charan – Pawan Kalyan : బాబాయ్ – అబ్బాయి బాండింగ్.. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..
తాజాగా దీనికి సంబంధించిన ఆడియో ఈవెంట్ జరగ్గా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో గోపికృష్ణ మాట్లాడుతూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన భావజాలం అందరి హృదయాలను తాకుతుంది. ఆయన ఉంటే యువతరానికి తన సాహిత్యం ద్వారా ఎలాంటి సందేశం ఇస్తారన్న ఆలోచనలో నుంచే స్వప్నాల నావ పాట వచ్చింది అని తెలిపారు.
సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ పార్ధసారథి నేమాని మాట్లాడుతూ.. ప్రతి చిన్న విషయానికి ఇప్పటి యువత నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. శాస్త్రిగారిలాంటి గొప్ప వ్యక్తి ఇచ్చిన సాహిత్యాన్ని ప్రేరణగా తీసుకుని పిల్లల కోసం ఈ పాట చేశాం. శ్రీజకు ప్రొఫెషనల్ సింగర్ అయ్యే లక్షణాలు ఉన్నాయి. ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన వీఎన్ ఆదిత్య ఈ పాటకు దర్శకత్వం వహించడం గొప్ప విషయం అని అన్నారు.
Also Read : Pawan Kalyan : సినిమాలు తీసేవాళ్ళే సినిమాల గురించి మాట్లాడాలి.. సినిమాలకు రాజకీయ రంగు పులమొద్దు..
డైరెక్టర్ VN ఆదిత్య మాట్లాడుతూ.. ఎన్నిసార్లు కిందపడితే మనిషి అంతే ఫాస్ట్ గా పైకి వస్తాడు. గోపీకృష్ణ కొత్త ప్రయాణం సక్సెస్ అవ్వాలి. శ్రీజ ప్రొఫెషనల్ సింగర్‌గా అనిపించింది. స్వప్నాల నావ పాటను త్వరలోనే షూటింగ్ చేసి మీ ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు.