నితిన్ పెళ్లికి వెళ్లిన పవన్ నిహారిక నిశ్చితార్థానికి ఎందుకు రాలేదంటే?..

మెగా డాటర్ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ వెంకట చైతన్యల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా తరలివచ్చింది. ఆగస్టు 13వ తేదీ రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో ఎంగేజ్‌మెంట్ జరిగింది. కరోనా కారణంగా కేవలం…కొద్ది మంది ఫ్యామిలీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, సుస్మిత, కళ్యాణ్ దేవ్, శ్రీజ, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తదితరులు హాజరయ్యారు. అయితే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల యంగ్ హీరో నితిన్ వివాహానికి వెళ్ళి ఆశీర్వదించిన పవన్ సొంత ఇంట్లో ఫంక్షన్ అందులోనూ స్వయానా అన్నకూతురు ఫంక్షన్‌కి రాకపోవడం ఏంటి? గతంలో ఓ సినిమా కార్యక్రమంలో నాగబాబు మాట్లాడుతుండగా ఫ్యాన్స్ పవన్ పవన్ అని అరిస్తే నాగబాబు ‘మేం పిలుస్తాం వాడు రాడు’ అంటూ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే పవన్ రాకపోవడానికి అసలు కారణం వేరే ఉందట. ప్రస్తుతం చాతుర్మాస దీక్షలో ఉన్నారు. సాయంత్రం ఆరు తర్వాత ప్రత్యేక పూజలు చేస్తారు అందుకే సాయంత్రం వేళ బయటకు రావడం వీలుపడదు అని అన్నయ్య నాగబాబుకి ముందుగానే చెప్పారని తెలుస్తోంది.
పవన్ వెళ్లడానికి వీలుపడని పక్షంలో భార్య, పిల్లల్ని అయినా పంపొచ్చు కదా అనే మాట కూడా వినిపిస్తోంది. ఈ విషయం గురించి క్లారిటీ రావాలంటే మెగాబ్రదర్స్‌లో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే. ఏది ఏమైనా నిహారిక నిశ్చితార్థానికి బాబాయ్ రాకపోవడం అనేది అక్కడ అందరూ ఉన్నా ఏదో తెలియని వెలితిగా అనిపించింది అంటున్నారు మెగాభిమానులు..