రాజన్నా నిన్నాపగలరా లిరికల్ వీడియో
యాత్ర సినిమాలోని రాజన్నా నిన్నాపగలరా అంటూ సాగే లిరికల్ వీడియా రిలీజ్

యాత్ర సినిమాలోని రాజన్నా నిన్నాపగలరా అంటూ సాగే లిరికల్ వీడియా రిలీజ్
వై.ఎస్.రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, వై.ఎస్.ఆర్ పాత్రలో నటిస్తున్న సినిమా, యాత్ర.. 70ఎమ్ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై, ఆనందోబ్రహ్మ ఫేమ్, మహి వి.రాఘవ్ డైరెక్షన్‌లో, విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్న యాత్ర సినిమాలోని, రాజన్నా నిన్నాపగలరా అంటూ సాగే లిరికల్ వీడియాని, నూతన సంవత్సరం సందర్భంగా రిలీజ్ చేసారు. ప్రముఖ లిరిసిస్ట్, సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ పాటకు అద్భుతమైన లిరిక్స్ రాయగా, వందేమాతరం శ్రీనివాస్ అంతే బాగా పాడాడు.
వై.ఎస్.ఆర్ ప్రజలకు చేసిన మేలులను వివరిస్తూ, మూవీ స్టిల్స్‌తో పాటు, మూవీ యూనిట్ విజువల్స్‌తో
ఈ పాటని రూపొందించారు. ఊర్లే ఏరల్లే మారి, హోరు హోరున ఉప్పొంగెరో అనే పాట ఆకట్టుకునేలా ఉంది.
కె (కృష్ణ కుమార్) సంగీత మందిస్తున్న యాత్ర, ఫిబ్రవరి 8న, వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
వాచ్ రాజన్నా నిన్నాపగలరా లిరికల్ వీడియో..