Salaar : భీమవరంలో టికెట్ రేట్స్ రగడ.. సలార్ పై వైసీపీ ఎమ్మెల్యే కుమారుడి రివ్యూ..

ప్రభాస్ సొంత ఊరులో ఒక్క థియేటర్లో కూడా బెనిఫిట్ షో పడకపోవడం గమనార్హం. ఇక సలార్ సినిమా చూసిన వైసీపీ ఎమ్మెల్యే బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి.. మూవీ పై తన రివ్యూ ఇచ్చారు.

Salaar : భీమవరంలో టికెట్ రేట్స్ రగడ.. సలార్ పై వైసీపీ ఎమ్మెల్యే కుమారుడి రివ్యూ..

YCP MLA son review on Prabhas Salaar Part 1 Ceasefire

Updated On : December 22, 2023 / 10:12 AM IST

Salaar : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సలార్ మొదటి భాగం.. సీజ్ ఫైర్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. నేడు ఇండియా వైడ్ భారీ స్థాయిలో భారీ అంచనాలు మధ్య ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమా కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్న అభిమానులు థియేటర్స్ వద్దకి చేరుకొని సందడి చేస్తున్నారు. సినిమా చూసిన వారు బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు. ప్రభాస్ నుంచి ఒక మాస్ బొమ్మ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు.. అరిరిపోయే మాస్ ఎంటర్టైనర్ దొరికినట్లు చెబుతున్నారు. దీంతో థియేటర్స్ వద్ద రెబల్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలతో సలార్ షోస్ మొదలయ్యాయి. కానీ ప్రభాస్ సొంత ఊరులో మాత్రం ఒక్క థియేటర్లో కూడా బెనిఫిట్ షో పడకపోవడం గమనార్హం. అసలు ఏమైందంటే.. ప్రభాస్ సొంత ఊరు భీమవరంలో సినిమా టికెట్స్ ని అధిక రేట్లకు టికెట్లు అమ్ముతున్నారంటూ గత రెండు రోజులుగా ఆందోళన జరుగుతుంది. ఈ విషయం గురించి అభిమానులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వ నిర్ణయించిన రేట్లకే టికెట్లు అమ్మాలని థియేటర్ యాజమాన్యాయానికి ఆర్డర్ పాస్ చేశారు. ఇక ఆ రగడ కారణంతో భీమవరంలో బెనిఫిట్ షోలు నోచుకొని పరిస్థితి వచ్చింది.

Also read : Salaar Twitter Review : సలార్ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది..

ఇక ఒంగోలు గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్ లో సలార్ సినిమా చూసిన వైసీపీ ఎమ్మెల్యే బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి.. మూవీ పై తన రివ్యూ ఇచ్చారు. సలార్ మూవీలో సెకండ్ ఆఫ్ బాగుందని, పైట్స్ సన్నివేశాలు అద్బుతంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇక విజయవాడ, ఏలూరులో ప్రభాస్ అభిమానులు.. థియేటర్స్ వద్ద తీన్మార్ కోడుతూ బాణాసంచా పేలుస్తూ సందడి చేస్తున్నారు. బెనిఫిట్ షోలతో అర్ధరాత్రి నుంచే సందడి మొదలవ్వడంతో.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా థియేటర్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.