రేపు ఒంటి గంటే డెడ్‌లైన్: బీజేపీకి కేజ్రీవాల్ సవాల్

రేపు ఒంటి గంటే డెడ్‌లైన్: బీజేపీకి కేజ్రీవాల్ సవాల్

Updated On : February 4, 2020 / 10:42 AM IST

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి ఛాలెంజ్ విసిరారు. మంగళవారం మాట్లాడిన ఆయన రేపటిలోగా బీజేపీ సీఎం అభ్యర్థి చెప్పాలని ఆ వ్యక్తితో తాను డిబేట్‌కు కూర్చునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ నాయకులు మాట్లాడుతూ.. ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీ తప్పకుండా తమ అభ్యర్థి పేరు ప్రకటించాలని లేదంటే మరో ప్రెస్ కాన్ఫిరెన్స్‌ను కూడా వాయిదా వేస్తానంటూ హెచ్చరించారు. 

‘ఢిల్లీ ప్రజలు బీజేపీ సీఎం అభ్యర్థి తెలుసుకోవాలనుకుంటున్నారు. నేను కూడా సీఎం అభ్యర్థితో డిబేట్‌కు రెడీగా ఉన్నాను. అదెక్కడ జరిగినా సరే.. వాళ్లు ఎంచుకున్న ప్లేస్‌కు వచ్చేందుకు తాను రెడీ అన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టో ప్రకటించనున్న క్రమంలో ఇలా వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 8నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా కేజ్రీవాల్ చాలెంజ్ సంచలనంగా మారింది. 

‘ప్రజలు తమ సీఎం అభ్యర్థి ముఖం చూడాలనుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలియకుండా ఓటు వేసేందుకు వాళ్లు సిద్ధంగా లేరు. అమిత్ షా ఏమో మీరు మాకు ఓటు వేస్తే మేం సీఎం అభ్యర్థి ఎవరో చెప్తాం అంటున్నారు. ప్రజాస్వామ్యంలో అభ్యర్థిని బట్టే ఓటు వేస్తారు’ అని అన్నారు. 

అమిత్ షా మాటలను బ్లాంక్ చెక్‌తో పోలుస్తూ.. ముందు ఓట్లు వేసేయండి తర్వాత పేరు చెప్తాం.. అంటే ముందు సంతకం పెట్టండి తర్వాత అమౌంట్ రాసుకుంటాం అనే రీతిలో ఉన్నాయంటూ పోల్చారు. ‘ఢిల్లీ ప్రజలు.. అమిత్ షా చెప్పినట్లు ఓటు వేస్తే.. ఎవరో నిరక్షరాస్యుణ్ని నిలబెట్టినప్పుడు.. ఢిల్లీని మోసం చేసినట్లు ఫీలవుతారని కేజ్రీవాల్ వెల్లడించారు. 

అందుకనే వారికి బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకూ సమయమిస్తున్నామని.. సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు.